కోవిడ్ ఆస్పత్రిలో చెలరేగిన మంటలు: 18 మంది మృతి, పలువురికి తీవ్రగాయాలు
గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలోని భరూచ్ ఆస్పత్రిలో శనివారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 18 మంది కరోనా రోగులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 50 మంది రోగులను స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది, అధికారులు కాపాడారు.
ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న 18 మంది కరోనా రోగులు మృతి చెందారని భరూచ్ ఎస్పీ రాజేంద్ర సింగ్ తెలిపారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడిన కారణంగా మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని చెప్పారు.

భరుచ్-జంబూసర్ హైవేకు సమీపంలోని ఈ నాలుగు అంతస్తుల ఆస్పత్రిని కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రిగా మార్చి కరోనా రోగులకు ఇక్కడ చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆస్పత్రిని ఓ ట్రస్టు నడుపుతోంది.
Gujarat| Fire breaks out at a COVID-19 care centre in #Bharuch.“According to primary information, probably 12 people have been killed in the incident of fire at Patel Welfare Hospital’s dedicated COVID-19 care centre at 12:30 am in Bharuch,” says police pic.twitter.com/8fzgw0Hc9N
— §umaiya khan (@pathan_sumaya) May 1, 2021
శనివారం తెల్లవారుజామున ఒంటిగంటకు ఆస్పత్రిలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో మొదట మంటలు అంటుకున్నాయని, వేగంగా ఆస్పత్రి మొత్తం వ్యాపించాయని అగ్నిమాపక అధికారి శైలేష్ సన్సియా తెలిపారు. సుమారు గంటపాటు శ్రమించి మంటలను పూర్తిగా ఆర్పివేసినట్లు చెప్పారు.
Breaking : heart-breaking videos from #Bharuch Welfare Hospital in Gujarat, serious fire incident has resulted 25 deaths and severe injuries. #Bharuch pic.twitter.com/GajpI3wUb8
— Syed saif ali (@SYEDSAI97044126) May 1, 2021
Recommended Video
ప్రమాదంలో 18 మంది చనిపోగా, మరో 50 మందిని స్థానికుల సహకారంతో కాపాడినట్లు ఆయన తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మరో ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. అయితే, అగ్ని ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇప్పటి వరకు తెలియరాలేదు. ఘటనపై గుజరాత్ సీఎం విజయ్ రూపాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications