లోయలో పడిన బస్సు: 18 మంది మృతి, 49 మందికి తీవ్ర గాయాలు
న్యూఢిల్లీ: పశ్చిమ నేపాల్‌లో బస్సు లోయలో పడిన ఘటనలో 18 మంది చనిపోయారు. ప్రయాణీకులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి 600మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో మరో
49 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాదం రాత్రి ఫోక్రాకాడ గ్రామ సమీపంలో సంభవించింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్ధలానికి చేరుకున్న సహాయక చర్యలు చేపట్టారు. 14 మృతదేహాలను సంఘటనా స్ధలంలో స్వాధీనం చేసుకోగా... మిగిలిన నలుగురు ఆసుపత్రిలో మరణించారు.

ఈ బస్సు కయిలాలీ జిల్లాలోని తికాపూర్ గ్రామం నుంచి కాలికోట్ జిల్లాకు వెళుతుండగా ఫోక్రాకాడ గ్రామ సమీపంలో ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. 38 సీట్లున్న బస్సులో 67 వరకు ప్రయాణిస్తున్నట్లు తెలిపారు.
గాయపడిన వారిని సమీపంలో ఉన్న ఆసుపత్రిలో చేర్పించినట్లు పోలీసులు పేర్కొన్నారు. కొండ లోయల్లో రోడ్లు అస్తవ్యస్తంగా ఉండటంతో పాటు, డ్రైవర్ల నిర్లక్ష్యంగా ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.












Click it and Unblock the Notifications