వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Labourers Missing: పని కోసం వచ్చారు.. అదృశ్యమయ్యారు.. భారత్-చైనా సరిహద్దులో ఏం జరిగింది..?

|
Google Oneindia TeluguNews

రోడ్డు పని కోసం వచ్చారు. కనిపించకుండా పోయారు. అదీ భారత్ చైనా సరిహద్దులో.. అసలు ఏం జరిగిందో ఇప్పటికీ తెలియడం. వారు ఎక్కడున్నారు.. బతికున్నారా లేక చనిపోయారా తెలియడం లేదు. తప్పిపోయిన వారి కోసం ఇప్పటికే సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. అయితే అందులో ఒకరు నదిలో శవమై తేలాడు.

14 రోజుల క్రితం..

14 రోజుల క్రితం..


అరుణాచల్ ప్రదేశ్‌లోని కురుంగ్ కుమే జిల్లాలో ఇండో-చైనా సరిహద్దులో రోడ్డు నిర్మాణ పనుల్లో ఉన్న 19 మంది వలస కూలీలు కనిపించకుండపోయారు. వీరు దాదాపు 14 రోజుల క్రితం తప్పిపోయారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తప్పిపోయిన వారిలో ఒకరి మృతదేహం ఓ నదిలో దొరికినట్లు డిప్యూటీ కమిషనర్ ధృవీకరించారు.

సెలవు కావాలని..

సెలవు కావాలని..

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) ఈశాన్య రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల విస్తృత నెట్‌వర్క్‌ను నిర్మిస్తోంది. ఇండో-చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న మారుమూల ప్రాంతమైన డామిన్ సర్కిల్‌లో రహదారి నిర్మిస్తున్నారు. రోడ్డు పనులు చేసేందుకు ఓ కాంట్రాక్టర్‌ 19 మంది కూలీలను అస్సాం నుంచి ఇక్కడకు తీసుకొచ్చారు. వారు మేలో ఇక్కడకు వచ్చారు. అయితే వారు బక్రీద్‌ పండుగ కోసం తమ స్వస్థలాలకు వెళ్తామని కాంట్రాక్టర్ ను కోరారు. కానీ వారి కోరికను కాంట్రాక్టర్ ఒప్పుకోలేదు.

సెర్చ్ ఆపరేషన్..

సెర్చ్ ఆపరేషన్..

దీంతో వారంతా జులై 5వ తమ శిబిరాల నుంచి పారిపోయారు. కూలీలు అదృశ్యమయ్యారని కాంట్రాక్టర్ జులై 13న స్థానిక పోలీసుస్టేషన్‌లో కాంట్రాక్టర్‌ ఫిర్యాదు చేశారు. అయితే కూలీలు కాలినడకవెళ్లి ఉంటారిని అడవిలో దారి తప్పి కనిపించకుండపోయారని పోలీసులు భావిస్తున్నారు. వీరి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

మృతదేహం లభ్యమైంది..

మృతదేహం లభ్యమైంది..


దమిన్‌ ప్రాంతంలోని కుమే నదిలో ఓ మృతదేహం లభ్యమైంది.ఈ బాడీ అదృశ్యమైన కూలీల్లో ఒకరిదంటూ సోషల్‌మీడియా, స్థానిక మీడియాల్లో కథనాలు వచ్చాయి.తాజా కథనాలపై కురంగ్ కుమే జిల్లా డిప్యూటీ కమిషనర్‌ నీఘే బెంగియా స్పందించారు. ఒక మృతదేహం లభ్యమైందని చెప్పారు. వారి కోసం సెర్చ్ ఆపరేషన్ జరుగుతోందని తెలిపారు.

English summary
One labourer died and 18 others are missing near the Indo-China border in Arunachal Pradesh's Kurung Kumey district. The labourers were involved in road works in Damin, when they went missing a week ago.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X