మహరాష్ట్ర:19 మంది కాంగ్రెస్, ఎన్ సి పి ఎమ్మెల్యేలు ఏడాది పాటు సస్పెన్షన్

ముంబై:మహరాష్ట్ర అసెంబ్లీ నుండి 19 మంది ఎమ్మెల్యేలను ఈ ఏడాది డిసెంబర్ 31వ, తేది వరకు సస్పెండ్ చేస్తూ మహరాష్ట్ర స్పీకర్ హరిబాబు బాగ్డే బుదవారం నాడు ప్రకటించారు.అసెంబ్లీని అవమానపర్చేలా వ్యవహరించినందుకుగాను వారిపై సస్పెన్షన్ వేటేసినట్టు స్పీకర్ ప్రకటించారు.

బుదవారం నాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత కాలిన బడ్జెట్ పత్రాలను కాంగ్రెస్, ఎన్ సి పి లకు చెందిన సభ్యులు సభలో ప్రదర్శించారు.

ఇందులో 10 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాగా, 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.అసెంబ్లీని అవమానపర్చేలా వ్యవహరించినందుకుగాను ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు సస్పెన్షన్ వేటు వేశారు.

19 Maharashtra MLAs suspended for 'insulting the house'

అసెంబ్లీని అవమానపర్చేలా వ్యవహరించినందుకుగాను ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసే తీర్మాణాన్ని రాష్ట్ర శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి గిరీష్ బాపట్ ప్రవేశపెట్టారు.ఈ తీర్మాణాన్ని బలపర్చడంతో 19 మంది ఎమ్మెల్యేలను సస్పెన్షన్ చేస్తూ స్పీకర్ ప్రకటించారు.

అయితే 19 మంది కాంగ్రెస్ ,ఎన్ సి పి ఎమ్మెల్యేలను సస్పెన్షన్ చేస్తూ నిర్ణయం స్పీకర్ నిర్ణయం ప్రకటించడాన్ని నిరసిస్తూ రాధాకృష్ణ విఖే పాటిల్ సభ నుండి వాకౌట్ చేశారు.సభ సంప్రదాయాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని మహరాష్ట్ర ఆర్థిక మంత్రి సమర్థించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+