ఒడిశా ఘోర రైలు ప్రమాదం ఎఫెక్ట్: 19 రైళ్లు రద్దు, పూర్తి జాబితా ఇదే
హైదరాబాద్: ఒడిశాలోని బాలాసోర్‌లో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద ఘటన వేలాది కుటుంబాల్లో కన్నీటిని మిగిల్చింది. ఈ ప్రమాద ఘటనలో ఇప్పటివ వరకు దాదాపు 300 మంది మరణించగా.. వెయ్యి మందికిపైగా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ ప్రమాదం కారణంగా పలు రైళ్లు రద్దు చేయడంతోపాటు మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. ఆదివారం రాత్రి నుంచే ప్రమాద ఘటనా స్థలంలో ట్రాక్ పునరుద్ధరించడంతో పలు రైళ్లు ఆ మార్గం గుండా వెళ్లాయి. అయితే, ప్రస్తుతం ఆ మార్గంలో పరిమితంగానే రైళ్లు నడుపుతున్నారు.
ఈ క్రమంలోనే సోమ, మంగళ, బుధ, శుక్రవారాల్లో పలు రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. షాలిమార్ నుంచి ఎంజీఆర్ చెన్నెై సెంట్రల్‌కు వెళ్లాల్సిన (12841) రైలును సోమ, మంగళవారాల్లో రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జూన్ 5న సంత్రగచి-తాంబరం రైలు(22841)తోపాటు హౌరా-చెన్నై(12839), ఎర్నాకుళం-హౌరా(22878) రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించారు.

జూన్ 6న హౌరా-సికింద్రాబాద్(12703), షాలిమార్-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్(18045), హౌరా-ఎస్ఎంవీటీ బెంగళూరు(22887), సంత్రగచి-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్(22807), ఎంజీఆర్ సెంట్రల్ చెన్నై-హౌరా(12840), విల్లుపురం-ఖరగ్‌పూర్(2204), హైదరాబాద్ దక్కన్-షాలిమార్(18046), షాలిమార్-తిరువనంతపురం(22642), గౌహతి-ఎస్ఎంవీటీ బెంగళూరు(12510), అగర్తాల-ఎస్ఎంవీఈ బెంగళూరు(12504), సికింద్రాబాద్-షాలిమార్(12774), సికింద్రాబాద్ హౌరా(12704) రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
Bulletin no.18 dt.05.06.2023 on Cancellation/Rescheduled of trains @RailMinIndia @drmvijayawada @drmsecunderabad pic.twitter.com/4qk0qBl5AR
— South Central Railway (@SCRailwayIndia) June 5, 2023
జూన్ 7వ తేదీన షాలిమార్-సికింద్రాబాద్(22849) రైలు, 9న సికింద్రాబాద్-షాలిమార్(22850) రైళ్ల సర్వీసులను రద్దు చేశారు. కాగా, మరికొన్ని రైళ్ల సమయాలను తాత్కాలికంగా రీషెడ్యూల్ చేశారు. సోమవారం సాయంత్రం 5.20గంటలకు బయల్దేరాల్సిన కన్యాకుమారి-దిబ్రూగఢ్ రైలు(22503) రైలును రాత్రి 10 గంటలకు రీషెడ్యూల్ చేశారు.












Click it and Unblock the Notifications