ప్రేమించలేదని క్లాస్ రూంలో చంపేశాడు (వీడియో)
చెన్నై/మధురై: ప్రొఫెసర్ చెబుతున్న పాఠాలు వింటున్న ఓ విద్యార్థిని మీద సీనియర్ విద్యార్థి దాడి చేసి దారుణంగా హత్య చేసిన ఘటన తమిళనాడులో జరిగింది. కరూర్ సమీపంలోని ఓ ప్రయివేట్ ఇంజనీరింగ్ కాలేజీలో మూడవ సంవత్సరం చదువుతున్న సోనాలి (19) అనే విద్యార్థిని హత్యకు గురైయ్యింది.
తమిళనాడులోని శివగంగై జిల్లా మానామదురైకి చెందిన సోనాలి తండ్రి నాలుగు నెలల క్రితం మరణించాడు. సోనాలి తల్లి చెన్నైలోని ఓ చిన్న సంస్థలో ఉద్యోగం చేస్తూ తన కుమార్తెను చదివించుకుంటున్నారు.
ఎప్పటిలాగే సోనాలి మంగళవారం కాలేజ్ కు వెళ్లింది. తరగతి గదిలో కుర్చోని పాఠాలు వింటున్నది. అదే సమయంలో కాలేజ్ నుంచి సస్పెండ్ అయిన ఉదయ్ కుమార్ (22) చేతిలో పెద్ద కర్ర తీసుకుని వచ్చి సోనాలి తల మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు.

ఉన్మాదిలా తయారై ఇష్టం వచ్చినట్లు దాడి చేసి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. తీవ్రగాయాలైన సోనాలి కుప్పకూలిపోయింది. సాటి విద్యార్థులు, ప్రొఫెసర్ షాక్ కు గురైనారు. వెంటనే కాలేజ్ సిబ్బంది సోనాలిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
మెరుగైన చికిత్స కోసం సోనాలిని మధురైలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై సోనాలి మరణించిందని పోలీసులు చెప్పారు. తనను ప్రేమించలేదని కక్ష పెంచుకున్న ఉదయ్ కుమార్ హత్య చేశాడని, అతనిని అరెస్టు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications