ఒకే ఇంటిలో ప్రియుడితో కాలేజ్ స్టూడెంట్: ఫోన్ వెంటనే రిసీవ్ చెయ్యలేదని !
ఒకే ఇంటిలో కలిసి నివాసం ఉంటుటన్న ప్రియుడు ఫోన్ చేసినా వెంటనే రిసీవ్ చెయ్యలేదనే చిన్న విషయానికి కాలేజ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు నగర శివార్లలోని తిప్పగూండనహళ్ళిలో జరిగింది.
బెంగళూరు: ఒకే ఇంటిలో కలిసి నివాసం ఉంటుటన్న ప్రియుడు ఫోన్ చేసినా వెంటనే రిసీవ్ చెయ్యలేదనే చిన్న విషయానికి కాలేజ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు నగర శివార్లలోని తిప్పగూండనహళ్ళిలో జరిగింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన రిజియా కాటూన్ (19) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది.
హీరోయిన్ ను కారులోనే నలుగురు, వీడియో, కోట్లు ఇవ్వకుంటే నీ పేరు; హీరోకి వార్నింగ్ !
ఒక సంవత్సరం క్రితం పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన రిజియా బెంగళూరు నగర శివార్లలోని అంబికా నర్సింగ్ కాలేజ్ లో డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతోంది. ఈమె అదే కాలేజ్ లో చదువుతున్న సమీమ్ అల్సబ్ అనే యువకుడిని ప్రేమించింది.

ప్రియుడు సమీమ్ అల్సబ్ తో కలిసి తిప్పగూండనహళ్ళిలో అద్దె ఇల్లు తీసుకుని అతనితోనే కలిసి నివాసం ఉంటున్నది. ఆదివారం రిజియా తన ప్రియుడు సమీమ్ మొబైల్ కు ఫోన్ చేసింది. అయితే సమీమ్ ఫోన్ రిసీవ్ చెయ్యలేదు.
రెండు మూడు సార్లు ఫోన్ చేసిని సమీమ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో జీవితంపై విరక్తి పెంచుకుంది. వెంటనే ఇంటిలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చిన ఆమె ప్రియుడు విషయం గుర్తించి ఫిర్యాదు చేశాడని, వైద్య పరీక్షల అనంతరం రిజియా మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులు విమానంలో పశ్చిమ బెంగాల్ తీసుకెళ్లారని నెలమంగల గ్రామీణ పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications