ఐఐటి కాన్పూర్ ఆంధ్ర విద్యార్థి అనుమానాస్పద మృతి

19-year-old IIT-Kanpur student's body found near railway track
న్యూఢిల్లీ: తలకు తీవ్రమైన గాయాలతో ఐఐటి కాన్పూర్ విద్యార్థి రైల్వే ట్రాక్‌పై మృతి చెందిన కనిపించాడు. బుధవారం తెల్లవారు జామును అతని మృతదేహం రైల్వే ట్రాక్‌పై కనిపించింది. అతన్ని ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాసం జిల్లాకు చెందిన జి. సాయికుమార్ రెడ్డిగా గుర్తించారు.

సాయికుమార్ రెడ్డి ఐఐటి కాన్పూర్‌లో మెటిరీయల్ సైన్స్‌ ద్వితీయ సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థి. తలకు గాయం కావడం వల్లనే అతను మరణించినట్లు పోస్టుమార్టం నివేదికలో తేల్చింది. అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు.

విద్యార్థి మృతికి గల కారణాలను కనిపెట్టడానికి విచారణకు ఆదేశించారు. శరీరం ముక్కలు కాకపోవడంతో అది ఆత్మహత్యగా కనిపించడం లేదని, ప్రమాదవశాత్తు రైలు కొట్టుకుని ఉంటుందని, ప్రమాదం జరిగిన చోట ధావా ఉందని స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ ఎకె ఘోష్ చెప్పారు.

విద్యార్థి డిప్రెషన్‌కు గురయ్యాడనే వాదనను విద్యాసంస్థ తోసిపుచ్చింది. సాయికుమార్ రెడ్డి యావరేజ్ స్టూడెంట్ అని, మృతి గల కారణాలను తెలుసుకోవడానికి విచారణ జరుగుతుందని ఘోష్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+