రక్తమోడుతున్న రాజధాని, వరుస హత్యలతో జనం బెంబేలు ... హస్తినలో టీనేజర్ మర్డర్
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో క్రైం రేటు ఆందోళన కలిగిస్తోంది. గత గురువారం నుంచి వివిధ ప్రాంతాల్లో ఆరుగురు చనిపోవడం భద్రతను ప్రశ్నిస్తోంది. రాజధాని నగరంలో హత్యల పరంపరతో నగరం ఉలిక్కిపడింది. తాజాగా 19 ఏళ్ల టీనేజీ యువకుడు కూడా చనిపోవడంతో ఆ ప్రాంతవాసులు భయాందోళనకు గురువుతున్నారు. హస్తినలో ఏం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు.
యువకుడి హత్య ..
గాంధీనగర్‌లోని తన ఇంట్లో యువకుడు విగతజీవిగా పడి ఉన్నాడు. అతడిని అసబ్‌గా పోలీసులు గుర్తించారు. సమీపంలోని ఫ్యాక్టరీలో పనిచేస్తారని స్థానికులు తెలిపారు. ఫ్యాక్టరీలో పనిచేసే తోటి ఉద్యోగులు అసబ్ రూంలో అచేతనంగా పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అసబ్ కడుపులో గాయాలైనట్టు పోలీసులు గుర్తించారు. కత్తెరతో దుండగులు దాడిచేశారని డీసీపీ మేఘనా యాదవ్ పేర్కొన్నారు. ఈ ఘటనపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.

ఆరు హత్యలు ...
అయితే గురువారం నుంచి ఢిల్లీలో ఆరు హత్యలు జరుగడం ఆందోళన కలిగిస్తోంది. భాల్‌స్వా డైరీ వద్ద ప్రాపర్టీ డీలర్, ఒక బాలుడిని హతమార్చారు. పశ్చిమ ఢిల్లీలోని వికాస్‌పురరి ప్రాంతంలో 35 ఏళ్ల ఇద్దరు వ్యక్తులను దుండగలు కాల్చిచంపారు. దీంతో రాజధాని నగరవాసులు ఏ నిమిషాన ఏం జరుగుతుందోనని గజగజ వణుకుతున్నారు. ఈ హత్య కేసులపై వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసు ఉన్నాతాధికారులు తెలిపారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications