నా కుమారుడికి బలవంతంగా మత మార్పిడి చేశారు: పెళ్లి చెయ్యడానికి అమ్మాయి తండ్రే !
బెంగళూరు: తమ కుమారుడిని బలవంతంగా ఇస్లాం మతంలో మార్చారని, అతన్ని మాకు అప్పగించి న్యాయం చెయ్యాలని కర్ణాటకలోని మండ్య జిల్లాకు చెందిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయం తెలుసుకున్న కొన్ని హిందూ సంఘ, సంస్థలు ఆందోళనకు దిగాయి.
మండ్య జిల్లాలోని పాండవపురకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి తన కుమారుడు చందన్ (19) అనే యువకుడిని బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారని ఆరోపించడంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు.

స్థానిక ముస్లీం నాయకుడు యూసఫ్ తన కుమార్తెను చందన్ కు ఇచ్చి పెళ్లి చెయ్యడానికి పక్కా ప్లాన్ వేసుకుని యువకుడికి మతమార్పిడి చేశారని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వెంటనే ఆ పెళ్లి అడ్డుకోవాలని చందన్ తండ్రి శ్రీనివాస్ పాండవపుర పోలీసులకు మనవి చేశారు.
ఈ విషయం తెలుసుకున్న పలు హిందు సంఘ, సంస్థలు ఆందోళనకు దిగాయి. హిందూ యువకులను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చి లవ్ జీహాద్ కు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. అయితే అసలు విషయం బయటకు లాగడానికి పోలీసు అధికారులు విచారణ మొదలు పెట్టారు. ముందు జాగ్రత చర్యగా మండ్య జిల్లాలో పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications