వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీం కోర్టు, ఆపరేషన్ స్మైల్ 280 మంది రక్షణ

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బెంగళూరు నగరంలో మొదటి సారి ఆపరేషన్ స్మైల్ ను ప్రారంభించారు. రోడ్లు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్ ల దగ్గర చిన్నారులు, పిల్లలను అడ్డం పెట్టుకుని భిక్షాటన చేస్తున్న వారిని రక్షించి పునరావాస కేంద్రాలకు తరలించారు.

గురువారం ఒక్క రోజు 190 మంది పిల్లలతో పాటు 280 మందిని రక్షించామని ఆపరేషన్ స్మైల్ సమన్వయ అధికారి, బెంగళూరు తూర్పు విభాగం అడిషనల్ పోలీసు కమిషనర్ హరిశేఖరన్ తెలిపారు. అతి త్వరలోనే బెంగళూరు నగరంలో పిల్లలు భిక్షాటన చెయ్యకుండ తగిన చర్యలు తీసుంటామని అన్నారు.

190 children rescued from beggary in city under Operation Smile drive

గురువారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు 70 ప్రత్యేక బృందాలు ఎర్పాటు చేసి నగరంలోని మెజస్టిక్, సిటి రైల్వే స్టేషన్, యశవంతపురం, కంటోన్మెంట్, శివాజీనగర్, సిటి మార్కెట్, బనశంకరి తదితర చోట్ల 190 మంది పిల్లలను రక్షించామని అన్నారు.

పిల్లలను మడివాళలోని బాలల పునరావాస కేంద్రాలకు తరలించామని హరిశేఖరన్ తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో భిక్షాటన చేస్తున్న పిల్లలను రక్షించి వారికి చదువు చెప్పించి వసతి కల్పించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

English summary
P. Harishekaran additional commissioner of police (East Zone) Bengaluru city said, 190 children rescued from beggary in city under Operation Smile drive on Thursday, August 6, 2015.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X