భారత్ దెబ్బ అదుర్స్.. 'లొంగిపోయిన 93 వేల మంది పాకిస్థాన్ సైనికులు'
జమ్ముకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహీద్ అఫ్రిది అడ్డగోలుగా నోటికొచ్చిన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. భారత్ ఎలాంటి ఆధారాలు లేకుండానే పాకిస్థాన్ పై ఆరోపణలు చేయడం తనను నిరాశ పరిచిందని చెప్పుకొచ్చాడు. ఇలాంటి చర్యలు ఉద్రిక్తతలు పెంచుతాయని అన్నాడు. శాంతి ప్రయత్నాలకు ఆటంకం కలుగుతుందని.. ఇలాంటి చర్యలు ఉద్రిక్తతలను పెంచుతాయన్నాడు. అయితే అఫ్రిది వ్యాఖ్యలకు భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజాగా అఫ్రిది వ్యాఖ్యలకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు వరల్డ్ ఛాంపియన్ షిప్ మెడలిస్ట్ పుగిలిస్ట్ బాక్సర్ గౌరవ్ బిధూరీ." పహల్గాం ఘటనపై భారత్ మొత్తం ఇంకా షాక్ లోనే ఉంది. ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకుంటున్న చర్యలకు పాకిస్థాన్ మైండ్ పనిచేయడం లేదు. ఉగ్రదాడి జరుగుతుంటే భారత్ లోని 8 లక్షల మంది సైన్యం ఏం చేస్తుందని అఫ్రిది అంటున్నాడు. 1971 భారత్- పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధంలో 93,000 మంది పాకిస్థాన్ సైనికులు భారత్ వద్ద సరెండర్ అయ్యారు. మీరా మా సైన్యం శక్తి గురించి మాట్లాడేది. ఈ ఘటన పాకిస్థాన్ చేసిందని రుజువు కావాలని అంటున్నావ్.. అన్నింటికీ రుజువులు ఉండవు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది పాకిస్థాన్ అని ప్రపంచం మొత్తానికి తెలుసు. ప్రపంచ దేశాలు భారత్ కు వచ్చి ఆటలు ఆడుతాయి. కానీ మీ దేశానికి ఎవరూ రారు. ఎందుకో ఆలోచించుకోండి" అని బాక్సర్ గౌరవ్ బిధూరీ ఘాటు రిప్లై ఇచ్చాడు.
1971 భారత్- పాకిస్థాన్ యుద్ధం..
బాక్సర్ గౌరవ్ బిధూరీ వ్యాఖ్యల తర్వాత 1971 భారత్- పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధంలో 93,000 మంది పాకిస్థాన్ సైనికులు భారత్ వద్ద సరెండర్ అయ్యారా..? అని నెట్టింట శోధిస్తున్నారు. అయితే 1971 భారత్- పాకిస్థాన్ యుద్ధంలో భారత్ విజయ పతాకం ఎగురవేసింది. దానికి గుర్తుగా ఏటా డిసెంబర్ 16ను విజయ్ దివాస్ గా భారత్ జరుపుకొంటూంది. ఈ యుద్ధం కారణంగానే పాకిస్థాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించింది.

డిసెంబర్ 16,1971న అప్పటి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అమీర్ అబ్దుల్లా నియాజీ.. 93 వేల పాకిస్థాన్ సైన్యంతో కలిసి భారత్ ముందు సరెండర్ అయ్యారు. దీంతో బంగ్లాదేశ్ కు ముక్తి లభించింది. డిసెంబర్ 3న ఇరు దేశాల మధ్య ప్రారంభమైన యుద్ధం 13 రోజుల పాటు జరిగింది. మానవీయ సంక్షోభం కారణంగా యుద్ధం ముగిసింది. యుద్ధంలో భారత్ విజయం సాధించింది.












Click it and Unblock the Notifications