1993 కాల్పులు... జలియన్ వాలాబాగ్ కంటే దారుణం: ఛటర్జీ కమిషన్
కోల్‌కత్తా: 1993 కోల్‌కత్తా యూత్ కాంగ్రెస్ ఉద్యమంలో పోలీసుల జరిపిన కాల్పులు జలియన్ వాలాబాగ్ ఘటన కంటే హేయమైనదని జస్టిస్ సుశాంత ఛటర్జీ కమిషన్ అభివర్ణించింది. వివరాల్లోకి వెళితే... 1993 కోల్‌కత్తాలో పోలీసుల కాల్పులపై జస్టిస్ సుశాంత ఛటర్జీ కమిషన్ తన తుది నివేదికను సోమవారం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది.
ఈ కాల్పుల ఘటనలో పోలీసుల వైఖరిని కమిషన్ తప్పు బట్టింది. ఈ ఘటనలో చనిపోయిన ఒక్కొక్క కుటుంబానికి రూ. 25 లక్షలు చెల్లించాలని సూచించింది. వామపక్ష ప్రభుత్వం పెద్దలు ఆదేశాల మేరకు కనిపించిన వారిని కనిపించినట్లు కాల్చేయమని ఆదేశాలు జారీచేసిన కంట్రోల్ రూమ్ ఆఫీసర్లను బాధ్యులుగా తన నివేదికలో పేర్కొన్నాడు.
పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
1993లో కోల్‌కతా మహానగరంలోని రాష్ట్ర సచివాలయం 'రైటర్స్ బెల్డింగ్' వద్ద తృణముల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ నేతృత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీని అడ్డుకోవాలని అప్పటి లెఫ్ట్ ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
దాంతో యూత్ కాంగ్రెస్ ఉద్యమ కార్యకర్తలపై పోలీసులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పోలీసులు 75 రౌండ్ల బుల్లెట్లను కాల్చినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. మరో 50 మంది గాయపడ్డారు.

మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా 2011లో సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత జస్టిస్ సుశాంత ఛటర్జీ కమిషన్ ఏర్పాటైంది. దాదాపు 300 మంది సాక్షులను విచారించిన కమిషన్ తన తుది నివేదికను 700 పేజీల రూపంలో ప్రభుత్వానికి అందజేసింది.
ఇక జలియన్ వాలాబాగ్ అనేది ఉత్తర భారత దేశంలోని అమృత్‌సర్ పట్టణంలో ఒక తోట. ఏప్రిల్ 13, 1919 న బ్రిటీష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు మరియు పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
ఈ కాల్పులు పది నిమిషాలపాటు కొనసాగాయి. 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి. అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం అక్కడ 1000 కి పైగా మరణించారు. 2000 మందికి పైగా గాయపడ్డారు.












Click it and Unblock the Notifications