కార్గిల్: భూమిలో లక్ష సజీవ బాంబులు (ఫోటోలు)

భోపాల్: మధ్యప్రదేశ్ లోని జబల్ నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు బాంబు పేలుళ్లు జరుగుతాయో అంటూ హడలి చస్తున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నామని స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

జబల్ పూర్ నగరం కింద దాదాపు లక్ష బాంబులు పాతిపెట్టడమే వారి ఆందోళనకు కారణం. 1999 లో కార్గిల్ యుద్దం సమయంలో పేలని, అధికారులు తిరస్కరించిన వేలాది బాంబులను జబల్ పూర్ ప్రాంతంలోని అర్డినెన్స్ ఫ్యాక్టరి ఖమారియా (ఓఎఫ్ కే)లోని భూగర్బంలో పాతిపెట్టారు.

ఆ బాంబులు ఇప్పటి వరకు అక్కడే సజీవంగా ఉన్నాయి. ఆ బాంబులు పేలితే భూకంపం వచ్చి నగర వాసులకు భారీ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. గత కొన్ని సంవత్సరాలు ఈ ప్రాంతంలో వరస పెట్టి బాంబు పేలుళ్లు జరుగుతున్నాయి.

మళ్లి పేలుడు

మళ్లి పేలుడు

గత శుక్రవారం రాత్రి పేలుడు సంభవించి ఇద్దరు ఓఎఫ్ కే ఉద్యోగులు గాయపడ్డారని అధికారులు తెలిపారు.

లక్ష బాంబులు

లక్ష బాంబులు

ఓఎఫ్ కే ప్రాంతంలో లక్షకు పైగా 84 ఎంఎం మోర్టార్లు, ఎల్ 70, బీఎంపీ 2 షెల్స్ ఉన్నాయని అధికారులు అంచనా వేశారు.

మ్యాగజైన్ ఎఫ్ 12 ప్రాంతం

మ్యాగజైన్ ఎఫ్ 12 ప్రాంతం

కార్గిల్ యుద్దం సమయంలో పేలుడు పదార్థాలు దాచి ఉంచిన మ్యాగజైన్ ఎఫ్ 12 ప్రాంతం మరింత ప్రమాదకరం అని వెలుగు చూసింది.

చెప్పినా పట్టించుకోలేదు

చెప్పినా పట్టించుకోలేదు

తాము అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఆర్డీఎక్స్ ఉంది

ఆర్డీఎక్స్ ఉంది

రోసోబోరోన్ ఎక్స్ పోర్ట్ సంస్థ (రష్యా) 2013లో సరఫరా చేసిన నాలుగు వేల కిలోల ఆర్గీఎక్స్ కూడా జబల్ పూర్ నగరం సమీపంలోనే నిక్షిప్తమై ఉందని సమాచారం.

నాణ్యతలేదని

నాణ్యతలేదని

రష్యా సరఫరా చేసిన ఆర్టీఎక్స్ నాణ్యత లేదని గుర్తించిన అధికారులు దానిని భూగర్బంలో పాతిపెట్టారు.

స్టాక్ తీసుకోకుండానే సరఫరా

స్టాక్ తీసుకోకుండానే సరఫరా

పాత స్టాక్ తీసుకోకుండానే రష్యా 2014లో ఆర్టీఎక్స్ సరఫరా చేసిందని ఓఎఫ్ కే ఉద్యోగులు అంటున్నారు.

అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం

అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం

జబల్ పూర్ నగరం నిత్యం అత్యంత రద్దీగా ఉంటుంది. అక్కడ ఎప్పుడు బాంబు పేలుడు జరుగుతుందో అంటూ స్థానికులు హడలిపోతున్నారు.

ఓ దేశంతో యుద్దం

ఓ దేశంతో యుద్దం

ఓ దేశంతో యుద్దం చెయ్యడానికి అవరసమైన బాంబులు ఇక్కడ ఉన్నాయని జాయింట్ కన్సల్టేషన్ మిషనరీ సభ్యుడు అరుణ్ దూబే అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+