మూర్ఖత్వానికి పరాకాష్ట: అమ్మవారు కలలో కన్పించిందని నాలుక కోసుకుంది
భోపాల్: ఓ వైపు ప్రపంచం కంప్యూటర్ యుగమంటూ పరుగులు పెడుతుంటే.. మరో వైపు మూఢ నమ్మకాల మూర్ఖత్వంతో కొందరు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఓ కళాశాల విద్యార్థిని చేసిన పనిని చూస్తే.. ఈ విషయం అర్థమవుతుంది. కలలో చెప్పిందని ఏకంగా తన నాలుకను కోసి అమ్మవారికి సమర్పించిందా యువతి.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని టిఆర్ఎస్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న 19ఏళ్ల ఆర్తీ దూబే.. స్థానిక దేవాలయంలో నాలుకను కోసి అమ్మవారికి సమర్పించుకుంది. ఎందుకని అడిగితే.. తనకు కలలో కాళికాదేవి కనిపించిందని.. నాలుకను సమర్పించమని కోరిందని చెప్పింది.
ఈ క్రమంలో రీవా పట్టణంలోని కాళికాదేవి ఆలయానికి వెళ్ళిన ఆర్తీ... బ్లేడుతో నాలుక కోసుకోవడంతో తీవ్రంగా రక్తస్రావమై అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. అయితే అక్కడి జనం, దేవాలయ సిబ్బంది, కొందరు భక్తులు.. నాలుక్కోసుకున్న అమ్మాయిని వెంటనే ఆస్పత్రికి తరలించడం మాని.. అమ్మవారు ప్రత్యక్షమైందంటూ సొమ్మసిల్లి పడిపోయిన ఆమె చుట్టూ చేరి పూజలు చేయడం వారి మూర్ఖత్వానికి పరాకాష్టగా చెప్పుకోచ్చు.
కాగా, దేవాలయంలో జరిగిన ఘటనకు ఆర్తీ కుటుంబసభ్యులే కాక, స్థానిక ప్రజలూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆధునిక కాలంలోనూ.. అందులో కాలేజీ స్థాయిలో చదువుకున్న అమ్మాయి అలా చేయడంపై విస్తుపోయారు. ఆర్తీ తన కల గురించి వివరించిందని, అమ్మవారికి నాలుకను కానుకగా ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పిందని.. అయితే ఏదో సరదాగా అలా అంటోందే తప్పించి.. నిజంగా ఇలా చేస్తుందని ఏమాత్రం ఊహించలేదని ఆర్తి సోదరుడు సచిన్ వాపోయాడు.
ఐదు గంటల తర్వాత ఘటనా స్థలానికే వచ్చిన ఓ వైద్యుడు.. ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. దాదాపు మాట్లాడే అవకాశం కోల్పోయినట్లేనని వైద్యులు చెబుతున్నారు.

నాలుక కోసుకున్న యువతి
ఓ వైపు ప్రపంచం కంప్యూటర్ యుగమంటూ పరుగులు పెడుతుంటే.. మరో వైపు మూఢ నమ్మకాల మూర్ఖత్వంతో కొందరు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

నాలుక కోసుకున్న యువతి
తాజాగా ఓ కళాశాల విద్యార్థిని చేసిన పనిని చూస్తే.. ఈ విషయం అర్థమవుతుంది. కలలో చెప్పిందని ఏకంగా తన నాలుకను కోసి అమ్మవారికి సమర్పించిందా యువతి.

నాలుక కోసుకున్న యువతి
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని టిఆర్ఎస్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న 19ఏళ్ల ఆర్తీ దూబే.. స్థానిక దేవాలయంలో నాలుకను కోసి అమ్మవారికి సమర్పించుకుంది. ఎందుకని అడిగితే.. తనకు కలలో కాళికాదేవి కనిపించిందని.. నాలుకను సమర్పించమని కోరిందని చెప్పింది.

నాలుక కోసుకున్న యువతి
ఈ క్రమంలో రీవా పట్టణంలోని కాళికాదేవి ఆలయానికి వెళ్ళిన ఆర్తీ... బ్లేడుతో నాలుక కోసుకోవడంతో తీవ్రంగా రక్తస్రావమై అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications