ఆశారాం బాపు అక్రమాస్తులు వేల కోట్ల పైనే
సూరత్: లైంగిక వేధింపులు, అత్యాచారం ఆరోపణలతో కటకటాల పాలైన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు, ఆయన కుమారుడు నారాయణ్‌సాయిలకు ఆదాయపన్ను శాఖ కన్ను పడింది. సూరత్, అహ్మదాబాద్, మొదాసా, జైపూర్, పుణె, ముంబై, ఢిల్లీ, ఇండోర్ లాంటి ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా వారి ఆశ్రమాలపై నిరుడు ఐటి శాఖ దాడులు నిర్వహించింది.

ఈ దాడుల్లో 42 సంచుల ఆస్తిపత్రాలు, హార్డ్ డిస్కులు, సీడీలు, సీపీయూలు సేకరించిన ఐటీ శాఖ వాటన్నిటినీ విశ్లేషించింది. తండ్రీకొడుకులిద్దరికీ లెక్కల్లో చూపని ఆస్తుల విలువ రూ.2500 కోట్లకు పైగానే ఉన్నట్టు వాటి ఆధారంగా తేల్చింది. ఈ మేరకు వారికి 750 కోట్ల మేర జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ దాడుల్లో ఐటీ శాఖ 4.35 కోట్ల నల్లధనాన్నీ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వివరాలన్నిటితో రూపొందించిన పూర్తిస్థాయి నివేదికను ఐటీ అధికారులు ఉన్నతాధికారులకు సమర్పించనున్నారు. వారి అనుమతి లభించగానే జరిమానా వసూలు చేస్తారు.












Click it and Unblock the Notifications