వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తండ్రికి షరతులు పెట్టిన అఖిలేష్! ఏం చేయలేక ములాయం...

యూపీలో సమాజ్‌వాదీ పార్టీలో తండ్రీకొడుకుల మధ్య రగడ తగ్గుముఖం పడుతున్నట్లుగా ఉంది. సీఎం అఖిలేష్‌ యాదవ్‌ మంగళవారం సాయంత్రం తన తండ్రి ములాయం సింగ్‌ యాదవ్‌ను కలిశారు.

|
Google Oneindia TeluguNews

లక్నో: యూపీలో సమాజ్‌వాదీ పార్టీలో తండ్రీకొడుకుల మధ్య రగడ తగ్గుముఖం పడుతున్నట్లుగా ఉంది. సీఎం అఖిలేష్‌ యాదవ్‌ మంగళవారం సాయంత్రం తన తండ్రి ములాయం సింగ్‌ యాదవ్‌ను కలిశారు.

పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని తిరిగి ములాయంకు ఇచ్చేందుకు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. అయితే, అందుకు కొన్ని షరతులు తండ్రి ముందు ఉంచారని తెలుస్తోంది.

ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక అధికారం తనకే ఉండాలని, ముఖ్యమంత్రి అభ్యర్థిగా తననే ప్రకటించాలని ములాయంకు కచ్చితంగా చెప్పారని తెలుస్తోంది. ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదను వెనక్కి తీసుకోవాలని చెప్పారు.

2 Hour Meet For Akhilesh, Mulayam Floats Hope But No Truce

అలాగే శివపాల్‌ యాదవ్‌ను రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పించి, జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యం కల్పించాలని చెప్పారు. పార్టీ సీనియర్ నేత అజమ్ ఖాన్ సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు చేశారు.

ట్విస్ట్, రంగంలోకి అజంఖాన్: ఫోన్లో మాట్లాడుకొని.. గంటలుగా మంతనాలు ట్విస్ట్, రంగంలోకి అజంఖాన్: ఫోన్లో మాట్లాడుకొని.. గంటలుగా మంతనాలు

అఖిలేష్ - ములాయంలు దాదాపు మూడు గంటల పాటు భేటీ అయ్యారు. ఏం జరిగిందనే విషయమై స్పష్టంగా చెప్పనప్పటికీ... పై నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అఖిలేష్ నిర్ణయాలకు ములాయం అంగీకరించినట్లుగా కూడా తెలుస్తోంది.

అదే సమయంలో ములాయంను ఇక నుంచి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడి పాత్ర పోషించాలని కూడా అఖిలేష్ తండ్రి ముందు ప్రతిపాదన చేసినట్లుగా చెబుతున్నారు. మెజార్టీ ఎమ్మెల్యేలు అఖిలేష్ వైపు ఉన్న విషయం తెలిసిందే.

English summary
2 Hour Meet For Akhilesh, Mulayam Floats Hope But No Truce.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X