ఇంటి వద్ద బాంబు పేలుడు: ఇద్దరు మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఓ ఇంటి వద్ద నాటు బాంబు పేలుడు కలకలం రేపింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Recommended Video
Santiago Flight 513 Mystery : Missing Flight Landed After 35 Years With 92 Skeletons
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామర్హటి గోలాఘాట్ ప్రాంతంలోని ఓ ఇంటి వద్ద నాటు బాంబు పేలింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని సాగర్ దత్త మెడికల్ ఆస్పత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతులను సాజిద్, రాజాగా గుర్తించారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications