అనంతనాగ్‌లో ఐఈడీ పేలుడు: ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో భారీ పేలుడు ఘటన కలకలం రేపింది. ఐఈడీ పేలుడు సంభవించడంతో ఇద్దరు పౌరులు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
దక్షిణ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా హకూరా బోదస్గాం ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. 'తిరిగి గ్రామానికి' అనే ప్రభుత్వ కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఈ పేలుడు సంభవించడం గమనార్హం.

పేలుడు ఘటనలో గాయపడినవారిని అనంతనాగ్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇది ఇలావుండగా, హజ్రత్బల్‌లోని సర్ సయ్యద్ గేట్ ఆఫ్ కాశ్మీర్ యూనివర్సిటీ సమీపంలోని మార్కెట్ వద్ద మరో సేలుడు సంభవించింది.
ఈ ఘటనలో ముగ్గురు పౌరులకు గాయాలయ్యాయి. వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఇది తక్కువ తీవ్రత గల పేలుడని పోలీసు అధికారులు చెప్పారు. ఈ పేలుడు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఇటీవల ఓ జాతీయ రహదారిపై ఉగ్రవాదులు అమర్చిన ఐఈడీని పోలీసులు గుర్తించి దాన్ని నిర్వీర్యం చేయడంతో పెను ప్రమాదం తప్పింది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications