దారుణం: నిద్రిస్తునన అక్కాచెల్లెళ్ల సజీవదహహనానికి యత్నం

Posted By:
Subscribe to Oneindia Telugu

బరేలీ: నిద్రిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లపై పెట్రోల్ పోసి సజీవదహనం చేసేందుకు దుండగులు ప్రయత్నించారు. కుటుంబ సభ్యులు సకాలానికి ఆస్పత్రికి తరలించడంతో వారి ప్రాణాలు నిలిచాయి. ఉత్తరప్రదేశ్‌లోని బరేలి జిల్లా నవాబ్ గంజ్ ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది.

శుక్రవారం రాత్రి దుండగులు తలుపులు బద్దలు కొట్టుకుని ఇంట్లోకి ప్రవేశించారు. నిద్రపోతున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటలకు వారు లేచి చూసేసరికి దుండగులు అక్కడినుంచి పారిపోయారు. 18 యేళ్ల గుల్షాన్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆమె చెల్లెలు ఫిజా(17)కు 40 శాతం కాలిగాయాలయ్యాయి.

2 teen sisters set on fire in sleep by unknown miscreants in UP's Bareilly

నిందితులు ఎవరో, ఎందుకు వచ్చారో తమకు తెలియదని ఫిజా చెప్పింది. ఎవరితోనూ తమకు గొడవలు లేవని, రాత్రిపూట ఒకే మంచంపై నిద్రిస్తున్న తమ ఇద్దరికీ నిప్పంటించారని చెప్పింది. తాను లేచి వారి ముఖాలు చూసేందుకు ప్రయత్నించానని, అయితే అప్పటికే పారిపోయార వెల్లడించింది.

ఈ సంఘటనపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. నిందితులను సాధ్యమైనంత త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a tragic incident, two sisters were set ablaze by few unknown miscreants late Friday night while they were sleeping in their home in Nawabganj area of Uttar Pradesh's Bareilly district.
Please Wait while comments are loading...