ఎన్‌కౌంటర్: ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఓ ఇంట్లో దాగి ఉన్న ముష్కరులపై కాల్పులు జరిపి హతమార్చినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను బుధవారం ఉదయం సైన్యం హతమార్చింది. ఓ ఇంట్లో దాగివున్న ముష్కరులపై కాల్పులు జరిపి మట్టుబెట్టినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.
బారాముల్లాలోని రఫియాబాద్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం రావడంతో పోలీసులు, భద్రతాసిబ్బంది సంయుక్తంగా మంగళవారం రాత్రి నుంచి కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో పజల్‌పొరా గ్రామంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాగి ఉన్నారని గుర్తించిన భద్రతాసిబ్బంది ఆ ఇంటిని చుట్టుముట్టారు. గమనించిన ముష్కరులు జవాన్లపైకి కాల్పులు జరిపారు. దీంతో భద్రతాసిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనాస్థలంలో రెండు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications