ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం: జవాను మృతి
ఉగ్రవాదులకు భారత బలగాలకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందగా ఒక జవాను అమరుడయ్యాడు. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయి.
శ్రీనగర్: భారత్-పాక్ సరిహద్దుల వద్ద మరోసారి ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. బందిపొరా జిల్లాలో ఉగ్రవాదులకు భారత బలగాలకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందగా ఒక జవాను అమరుడయ్యాడు.
ప్రస్తుతానికి తాత్కాలికంగా ఎదురుకాల్పులు ఆగిపోయినప్పటికీ.. ఉగ్రవాదుల గాలింపు కొనసాగుతోంది. తరచూ ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతుండటంతో వ్యాలీలో ఉగ్రిక్త వాతావరణమే కొనసాగుతోంది.

ఎదురుకాల్పుల్లో మరణించిన ఉగ్రవాదులు లష్కరే తొయిబాకు చెందిన వారే అయివుంటారని ఆర్మీ అధికారులు అభిప్రాయపడ్డారు. కాగా, అనవసరంగా తమ సైన్యంపై భారత్ కాల్పులు జరుపుతోందని గురువారం పాకిస్థాన్ ఆరోపించిన విషయంతెలిసిందే. అంతేగాక, తమను రెచ్చగొట్టవద్దని భారత్‌కు హెచ్చరిక కూడా చేసింది.












Click it and Unblock the Notifications