ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్- వారంలో 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోం..!

అమెరికా-ఇరాన్ యుద్దం నేపథ్యంలో ఎదురవుతున్న చమురు కష్టాలకు చెక్ పెట్టేందుకు దేశవ్యాప్తంగా ప్రతీ ఒక్కరూ పొదుపు పాటించాలని, వాహనాల వాడకం తగ్గించాలంటూ ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు గట్టిగానే పనిచేస్తోంది. ప్రభుత్వాలు వరుసగా పొదుపు చర్యలు ప్రకటిస్తున్నాయి. ఇదే క్రమంలో ఢిల్లీలో రేఖా గుప్తా నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారంలో రెండు రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోం (WFH) ప్రకటించింది.

ప్రభుత్వ కార్యాలయాల్లోనూ వర్క్ ఫ్రమ్ హోమ్.. మోడీ పొదుపుసూత్రాలు ఏపీలో అమలు!
ప్రభుత్వ కార్యాలయాల్లోనూ వర్క్ ఫ్రమ్ హోమ్.. మోడీ పొదుపుసూత్రాలు ఏపీలో అమలు!

ప్రభుత్వ కార్యాలయాలు రెండు రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోం విధానంలో ఇంటి నుంచి పని చేయాలని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఆదేశాలు ఇచ్చారు. వాహనాల వినియోగాన్ని కనిష్ట స్థాయికి తగ్గించాలని పిలుపునిచ్చారు. దీంతో వాహనాల వల్ల కాలుష్యం కూడా తగ్గే అవకాశముంది. ప్రధాని మోడీ తాజాగా సికింద్రాబాద్ లో జరిగిన బహిరంగ సభలో పొదుపు చర్యలకు పిలునిచ్చారు. ఇంధనాన్ని పొదుపు చేయాలని, సాధ్యమైన చోటల్లా మెట్రో రైలు , ప్రజా రవాణాను ఉపయోగించాలని, కార్-పూలింగ్‌ను అవలంబించాలని, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని ప్రధాని మోదీ పౌరులకు విజ్ఞప్తి చేశారు.

2 WFH Days a Week for Delhi Govt Employees PM s Appeal Triggers Policy Shift
WFH: మోడీ వర్క్ ఫ్రమ్ హోమ్ సలహా వెనుక ? 70 దేశాల బాటలో భారత్..!
WFH: మోడీ వర్క్ ఫ్రమ్ హోమ్ సలహా వెనుక ? 70 దేశాల బాటలో భారత్..!

కోవిడ్-19 కాలంలో ఇంధన వినియోగాన్ని తగ్గించి, సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సక్సెస్ మోడల్ గా నిరూపితమైన వర్క్ ఫ్రమ్ హోం విధానం, ఆన్‌లైన్ సమావేశాలు, వర్చువల్ కాన్ఫరెన్స్‌లను పునరుద్ధరించాలని పరిశ్రమలను, కార్యాలయాలను ప్రోత్సహించారు. విదేశీ మారక నిల్వలను పరిరక్షించుకోవడానికి, దిగుమతి చేసుకున్న అనవసర వస్తువుల కొనుగోళ్లకు, అనవసరమైన విదేశీ విహారయాత్రలకు దూరంగా ఉండాలని మోడీ పౌరులకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఢిల్లీ సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోంతో పాటు పలు చర్యలు ప్రకటిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+