భారీ ఎన్‌కౌంటర్: ఇద్దరు మహిళలతోపాటు ఆరుగురు నక్సల్స్ మృతి
Bijapur encounter: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపుర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మహిళతో సహా ఆరుగురు నక్సల్స్(మావోయిస్టులు) మరణించారు. బీజాపూర్ అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. చికుర్బత్తి - పుస్బాక సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ఎదురుకాల్పుల ఘటన జరిగింది.
డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్(DRG), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) కోబ్రా దళానికి చెందిన సిబ్బంది కలిసి యాంటీ నక్సల్ ఆపరేషన్‌ను చేపట్టాయి. ఈ క్రమంలోనే భద్రతా సిబ్బందిపై నక్సల్స్ కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించినట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు.

'కాల్పుల ఆగిన తర్వాత ఘటనా స్థలం నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాం. భారీ ఆయుధాలు, పేలుడు పదార్థాలకు కూడా తీసున్నాం. కాల్పుల్లో పలువురు నక్సలైట్లు గాయపడ్డారు. ఇంకా బీజాపుర్ అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి' అని ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు.
#WATCH | On naxals neutralised in encounter with security forces in Bijapur district, Bastar IG P Sundarraj says, " Under Basaguda PS limits, bodies of 6 naxals including four males and two females were recovered. communication systems used by naxals also recovered. Further… pic.twitter.com/i9NfIBTxOx
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) March 27, 2024
కాగా, బీజాపుర్ జిల్లా బస్తర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది. ఈ స్థానానికి ఏప్రిల్ 19న తొలి విడతలోనే పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు యాంటీ-నక్సల్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
మరోవైపు, ఇటీవలే మహారాష్ట్రలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు నక్సలైట్లు మృతి చెందారు. మరణించిన నలుగురూ తెలంగాణ రాష్ట్ర కమిటీ మావోయిస్టులుగా అధికారులు గుర్తించారు. గడ్చిరోలి జిల్లాలో 60 కమాండర్లతో ఈ ఆపరేషన్ జరిగిందని వెల్లడించారు.












Click it and Unblock the Notifications