బస్సు ప్రమాదంపై యోగి ఆదిత్యనాథ్ దిగ్బ్రాంతి, ఘటనాస్థలానికి యూపీ మంత్రి, మృతులకు పరిహారం
యూపీలోని కనౌజ్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఎస్పీ, కలెక్టర్లను సంఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఘటనాస్థలానికి వెళ్లాలని క్యాబినెట్ మంత్రి రాం నరేశ్ అగ్నిహోత్రికి సీఎం యోగి ఆదిత్య నాథ్ ఆదేశాలు జారీచేశారు. దీంతో ఆయన ప్రమాద స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ప్రమాదంలో చనిపోయిన మృతులకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్సలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం అందజేస్తామని పేర్కొన్నారు. ఘటనపై నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్టు పేర్కొన్నారు. కనౌజ్ జిల్లా గుర్సాగంజ్ నుంచి జైపూర్ వెళ్తుండగా జీటీ రోడ్డు వద్ద బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు ప్రమాదానికి గురయ్యాక ప్రయాణికులు బయటకొచ్చే వీలులేకుండా పోయిందని తెలుస్తోంది. బస్సులో అప్పటికే ప్రయాణికులు నిద్రపోయారని.. తలుపు, కిటికీలు తెరుచుకోకపోవడంతో అందులోనే ఉండిపోయారని తెలుస్తోంది. డబుల్ డెక్కర్ బస్సు విమల్ బస్సు సర్వీసెస్‌కు చెందినదిగా అధికారులు గుర్తించారు.
ఘినోయ్ గ్రామం వద్ద శుక్రవారం రాత్రి 9.30 గంటలకు డబుల్ డెక్కర్ బస్సును-ట్రక్కు ఢీ కొనడంతో మంటలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో బస్సులో 43 నుచి 50 మంది వరకుప్రయాణికులు ఉన్నారు. స్థానికుల సమాచారంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. పైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొస్తున్నాయి. ప్రమాదంలో 20 మంచి చనిపోయారని, 21 మంది గాయపడ్డారని కనౌజ్ ఎస్పీ తెలిపారు. బస్సులో మొత్తం 43 మంది ప్రయాణికులు ఉన్నారని జిల్లా కలెక్టర్ అంతకుముందు మీడియాకు తెలియజేశారు. అందులో 26 మంది గుర్సాగంజ్ వద్ద 17 మంది చిబ్రమౌ వద్ద ప్రవేశించారని తెలిపారు. బస్సు ప్రమాదానికి గురైన వెంటనే ప్రయాణికులు తప్పించుకోవడానికి వీలులేకుండా పోయింది. అందుకే మృతుల సంఖ్య పెరగడానికి కారణమైందనే వాదన కూడా వినిపిస్తోంది. బస్సు ట్రక్కును ఢీ కొనడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షి రామ్ సేన్ తెలిపారు. వెంటనే బస్సు అద్దం పగులగొట్టి బయటకొచ్చానని చెప్పారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications