సెల్ ఫోన్ తో చెలగాటం: 20 మంది దుర్మరణం
భువనేశ్వర్: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అన్ గూల్ జిల్లా ఆత్మలిక్ సమీపంలో వేగంగా వెలుతున్న ప్రయివేట్ బస్సు బ్రిడ్జ్ మీద అదుపుతప్పి పై నుంచి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు.
30 మందికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై ఐదుగురు మరణించారని పోలీసు అధికారులు చెప్పారు. పలువురి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక పోలీసులు చెప్పారు.
శుక్రవారం ఉదయం భౌద్ జిల్లా నుంచి ఆత్మలిక్ కు ఓ ప్రయివేట్ బస్సు బయలుదేరింది. బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ఉదయం 10 గంటల సమయంలో బస్సు బ్రిడ్జ్ మీద అదుపుతప్పడంతో ప్రమాదం జరిగింది.

డ్రైవర్ నిర్లక్షంగా సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ వెలుతున్నాడని, అదే సమయంలో బస్సు అదుపుతప్పిందని తీవ్రగాయాలైన ప్రయాణికులు చెప్పారని అన్ గూల్ జిల్లా ఎస్పీ కవిత జలాన్ తెలిపారు.
విషయం తెలుసుకున్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అధికారులో సంప్రధించి తీవ్రగాయాలైన వారికి మెరుగైన చికిత్స అంధించాలని సూచించారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసు అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications