గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 25మంది మృతి..
అహ్మదాబాద్: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భావ్‌నగర్ సమీపంలో రంగేలా వంతెన పైనుంచి వెళ్తున్న సమయంలో.. ఓ ట్రక్కు అదుపు తప్పి కింద పడిపోయింది. ట్రక్కు పెళ్లి బృందంతో నిండి ఉండటంతో.. దాదాపు 25మందికి పైగా మృతిచెందారు. ఇరవై మంది అక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు చికిత్స పొందుతూ కన్నుమూశారు.

మిగిలినవాళ్లలో చాలామందికి తీవ్రగాయాలైనట్టు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 20 మృతదేహాలు చెల్లాచెదురుగా పడటంతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది.

ప్రమాద సమయంలో ట్రక్కులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం చోటుచేసుకున్నట్టు చెబుతున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.
Over 20 people dead after a truck they were travelling in fell into a drain in Gujarat's Bhavnagar pic.twitter.com/0SUi6HeRr0
— ANI (@ANI) March 6, 2018












Click it and Unblock the Notifications