నోట్ల రద్దు ఎఫెక్ట్ : 'క్యూ'లో తమ్ముడు.. ఇంట్లో అక్క ఆత్మహత్య
ముజఫర్‌నగర్ : నోట్ల రద్దు సామాన్యులను జీవితాలను తీవ్ర ఆందోళనలోకి నెట్టేస్తోంది. ఎంత ప్రయత్నించినా.. కొత్త నోట్లు దొరకకపోవడంతో.. ఇక తన అనారోగ్యానికి చికిత్స చేయించుకునే అవకాశం లేదని భావించిన షబానా (20) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. యువతి ఆత్మహత్య సమయంలో ఆమె తమ్ముడు బ్యాంకు ముందు 'క్యూ'లో నిలుచుని ఉండడం పరిస్థితికి అద్దం పడుతోంది.
గడిచిన కొద్ది రోజులుగా కొత్త నోట్ల కోసం బ్యాంకుల ముందు తీవ్ర పడిగాపులు పడుతూ వస్తున్నాడు మొబిన్ అనే కుర్రాడు. ఇంట్లో అక్క అనారోగ్యంతో బాధపడుతుండడంతో.. చికిత్స చేయించడానికి చేతిలో డబ్బు లేకుండా పోయింది. కొత్త కరెన్సీ కోసం రోజూ బ్యాంకుకు వెళ్లి ప్రయత్నిస్తున్నా.. లాభం లేకుండా పోయింది.

ఈ నేపథ్యంలో.. ఇక తన చికిత్స జరగడం కష్టమే అని భావించిన యువతి ఇంట్లోని ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని షామ్లి జిల్లా పరిధిలో ఉన్న ముజఫర్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. బ్యాంకు ముందు గంటల తరబడి వేచి చూసినా.. కొత్త కరెన్సీ దొరకకపోవడంతో.. నిరాశ వెనుదిరిగాడు మొబిన్. తీరా ఇంటికొచ్చాక చూస్తే.. అక్క ఆత్మహత్య చేసుకుని కనిపించింది. దీంతో ప్రస్తుతం ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications