స్నేహం చేయలేదని యువతిని పొడిచి చంపాడు

పోలీసుల కథనం ప్రకారం.. బాధిత యువతి(20)ని గత కొద్ది నెలల నుంచి నిందితుడు తనతో స్నేహం చేయాలని వేధింపులకు గురిచేస్తున్నాడు. తాను స్నేహం చేయలేనని చెప్పినా వినకుండా ఆమె వెంట పడుతుండటంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కాగా, శుక్రవారం ఉదయం ఆ యువతి ఇంటికి వచ్చిన నిందితుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు. విచక్షణారహితం ఆమెను పొడిచాడు. అడ్డుకునేందుకు వచ్చిన ఆమె తల్లిపై కూడా దాడి చేశాడు. ఆ తర్వాత నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ ఘటనలో యువతి మృతి చెందగా, ఆమె తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలిని స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications