చెంపదెబ్బ: గోవిందా క్షమాపణ చెప్పాలంటూ ఆదేశం
ముంబై: 2008లో బాలీవుడ్ నటుడు గోవిందా, చెంప చెళ్లు మనిపించిన కేసు తీర్పును సుప్రీం కోర్టు వెల్లడించింది. బాధితుడు సంతోష్ రాయ్‌కు క్షమాపణలు చెప్పాలంటూ గోవిందాను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సోమవారం ఆదేశించింది.
వివరాల్లోకి వెళ్తే, 2008లో ముంబైలోని ఫిల్మిస్థాన్ స్టూడియోస్‌లో 'మనీ హైతో హానీ హై' అనే సినిమా షూటింగ్ సందర్భంగా సంతోష్ రాయ్ అనే వ్యక్తి చెంపను గోవిందా చెళ్లుమనిపించిన సంగతి తెలిసిందే.

దీంతో, గోవిందా తనకు క్షమాపణ చెప్పలని డిమాండ్ చేస్తూ సంతోష్ రాయ్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే, ఘటన జరిగిన ఏడాది తర్వాత కేసు నమోదు చేశాడన్న కారణంతో 2013లో హైకోర్టు ఈ కేసును కొట్టి వేసింది.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే తాను రూ.5 నుంచి 6 లక్షలను ఖర్చు చేశానని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకు వచ్చాడు. ఈ క్రమంలో, సుప్రీంకోర్టు సంతోష్ రాయ్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. సంతోష్ రాయ్‌కు క్షమాపణలు చెప్పాలంటూ బాలీవుడ్ నటుడు గోవిందాకు ఆదేశాలు జారీ చేసింది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications