కొత్త ఉద్యోగాలు, జీతాలూ పెరుగుతాయ్: మెర్సర్ సర్వే తీపికబురు

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఉద్యోగస్తులకు, ఉద్యోగార్థులకు నిజంగా ఈ వార్త తీపి కబురే. ఎందుకంటే ఇటీవల నిర్వహించిన సర్వేలో ఈ సంవత్సరంలో కొత్తగా ఉద్యోగాలను పలు సంస్థలు భారీ ఎత్తున చేపట్టనున్నట్లు తేలింది.

అంతేగాక, ఉద్యోగస్తులకు అన్ని సంస్థలు కూడా జీతాలను సుమారు 10శాతం వరకు పెంచుతాయని ఈ సర్వేలో వెల్లడైంది. ఉద్యోగస్తులకు సంస్థలు సానుకూలంగా ఉండనున్నాయని తెలిపింది.

 వీటిపైనే సర్వే

వీటిపైనే సర్వే

కంపెనీల జీతభత్యాలు, సిబ్బందిపై మెర్సర్స్ పే-2017 ఇండియా టోటల్ రెమ్యునరేషన్ ఓ అధ్యయనం చేపట్టింది. ఇండస్ట్రీ సెక్టార్‌లో 791 సంస్థలను సర్వే చేసింది.

 గత ఏడాది కంటే ఎక్కువే..

గత ఏడాది కంటే ఎక్కువే..

ఈ సర్వే ప్రకారం.. 2018లో కంపెనీలు తమ ఉద్యోగుల జీతాలను 10శాతం వరకు పెంచే యోచనలో ఉన్నట్లు తెలిసింది. అంతేగాక, 55శాతం కంపెనీలు వచ్చే 12నెలల్లో కొత్తవారిని నియమించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపింది. ఇది గత సంవత్సరం 48శాతమే ఉండటం గమనార్హం.

అవకాశాలకు కారణం ఇదే

అవకాశాలకు కారణం ఇదే

నైపుణ్యం గల ఉద్యోగుల కొరత ఏర్పడటం, కంపెనీలు ఆర్థికంగా పుంజుకునే అవకాశం ఉండటంతో సిబ్బందిని పెంచుకోవాలనే నిర్ణయం తీసుకున్నట్లు మెర్సర్ ఇండియా బిజినెస్ లీడర్ శాంతి నరేష్ తెలిపారు.

భారీగానే ఉద్యోగావకాశాలు

భారీగానే ఉద్యోగావకాశాలు

ప్రతి రెండు సంస్థల్లో ఒకటి ఈ ఏడాది తమ సిబ్బందిని పెంచుకోవాలని చూస్తున్నట్లు సర్వే తెలిపింది. ఎఫ్ఎంసీజీ, తయారీ, సేల్స్, డిజైనింగ్, అనలటిక్ రంగాల్లో బాధ్యతలు ఎక్కువ కావడంతో కొత్త సిబ్బంది నియామకాలు అనివార్యమని సర్వే తేల్చింది. క్లౌడ్, సెక్యూరిటీ, డేటా సైన్స్ తదితర రంగాల్లో కూడా నైపుణ్యం ఉన్నవారికి ఈ ఏడాది ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Salaries are expected to grow by 10 per cent across industries and career levels as organisations are likely to increase headcount this year, says a report.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి