• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2021 year ender: హింసాత్మక ఘటనలు, అణచివేతల మధ్య సాగిన రైతుఉద్యమం, సాగుచట్టాల రద్దుతో చారిత్రాత్మకం

|
Google Oneindia TeluguNews

2021వ సంవత్సరంలో దేశ రాజధాని ఢిల్లీ, ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు సాగించిన పోరాటం చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు సాగించిన పోరాటం 2021 చివరి నాటికి ఎట్టకేలకు ఫలించింది. కేంద్రం తీసుకువచ్చిన కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించే దాకా అలుపెరుగకుండా రైతన్నలు పోరాటం సాగిస్తూనే ఉన్నారు. 2020 నవంబర్ 25 న మొదలైన రైతు ఉద్యమానికి 2021లో శుభం కార్డు పడటం శుభ పరిణామం అని చెప్పాలి .

2021లో సాగు చట్టాల రద్దు కోసం సాగిన రైతుల పోరాటం సక్సెస్

2021లో సాగు చట్టాల రద్దు కోసం సాగిన రైతుల పోరాటం సక్సెస్

దేశ రాజధాని ఢిల్లీలో రైతులు సాగిస్తున్న ఉద్యమానికి ఏడాది పూర్తి కావస్తున్న సమయంలో కేంద్రం తీసుకున్న సంచలన నిర్ణయం అన్నదాతలలో సంతోషానికి కారణమైంది. రైతుల ఆందోళనను కట్టడి చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతో మంది రైతులు రైతుల ఉద్యమ ప్రస్థానంలో ప్రాణాలు కోల్పోయినా సరే మొక్కవోని దీక్షతో రైతన్నలు పోరాటం చెయ్యటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. 3 సాగు చట్టాలను రద్దు చేసేది లేదని తేల్చి చెప్పిన సర్కార్ రైతుల అకుంఠిత దీక్షకు శిరసు వంచాల్సి వచ్చింది. సాగు చట్టాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవటమే కాదు, ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. 2021సంవత్సరం ఢిల్లీ కేంద్రంగా ఆందోళన చేసిన రైతులకు విజయాన్ని చేకూర్చింది.

నవంబర్ 25వ తేదీన మొదలైన ఉద్యమ ప్రస్తానం .. 2021లో ఉధృతంగా

నవంబర్ 25వ తేదీన మొదలైన ఉద్యమ ప్రస్తానం .. 2021లో ఉధృతంగా


ఇక రైతుల ఉద్యమం విషయానికి వస్తే కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపైరైతులుచలో ఢిల్లీ పేరుతోనిరసనలకు, ఆందోళనలకు నవంబర్ 25వ తేదీన శ్రీకారం చుట్టారు. పంజాబ్ ,హర్యానా, ఉత్తరప్రదేశ్ , కర్ణాటక వంటి రాష్ట్రాల నుండిరైతులుచలో ఢిల్లీ అంటూ రైతులు ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నారు. రైతులు చలో ఢిల్లీ లాంగ్ మార్చ్ ను ప్రారంభించిననేపధ్యంలోనే హింస మొదలైంది.వారిని అణచి వేయడానికిపోలీసులువాటర్ క్యానన్లను ఉపయోగించారు.భారీ బారికేడ్లను,ముళ్ల కంచెలను ఏర్పాటు చేసిరైతులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.దీంతో రైతుల ఆందోళనహింసాత్మకంగా మారింది.అప్పుడు మొదలైన హింసాత్మక ఘటనలు రైతుల ఉద్యమంలో అనేక సార్లు హింసాత్మకంగా మారాయి. 2021 సంవత్సరంలో అనేక సార్లు కొనసాగుతూ వచ్చాయి.

2021 సంవత్సరంలో సాగిన రైతుల ఉద్యమం ముఖ్య ఘట్టాలు

2021 సంవత్సరంలో సాగిన రైతుల ఉద్యమం ముఖ్య ఘట్టాలు


ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్న రైతులు ప్రణాళికాబద్దంగా ఆందోళన కొనసాగించారు. కిసాన్ సంయుక్త మొర్చాగా ఏర్పడి ఆందోళన పంధాను కొనసాగించారు. ఇక 2021 జనవరి నుండి రైతు ఉద్యమం ముగిసే వరకు సాగిన రైతు పోరాటంలో ముఖ్యమైన ఘట్టాలను చూస్తే జనవరి 7 2020 1వ తేదీన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణకు అంగీకరించింది. రైతులకు నష్టం చేకూర్చే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఈ పిటిషన్ లు దాఖలు చేస్తూ రైతులు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు విచారణకు అంగీకరిస్తూ నిర్ణయం తీసుకుంది. జనవరి 11వ తేదీన మాజీ సీజేఐ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇక జనవరి 12వ తేదీన వ్యవసాయ చట్టాల అమలు పై స్టే విధించిన కోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.

 జనవరి 26 హింసాత్మకంగా మారిన కిసాన్ పెరేడ్

జనవరి 26 హింసాత్మకంగా మారిన కిసాన్ పెరేడ్

ఆ తర్వాత జనవరి 26 వ తేదీ 2021 రిపబ్లిక్ డే సందర్భంగా రైతులు నిర్వహించిన కిసాన్ పెరేడ్ హింసాత్మకంగా మారింది. జనవరి 26 వ తేదీన ట్రాక్టర్లతో పెరేడ్ నిర్వహించాలని భావించిన రైతులను పోలీసులు అడ్డుకోవడంతో, భాష్పవాయువు ప్రయోగించడంతో రైతులు నిర్వహిస్తున్న కిసాన్ పరేడ్ హింసాత్మకంగా మారింది. విచక్షణరహితంగా పోలీసులపై రైతులు విరుచుకుపడ్డారు. ఢిల్లీ ఎర్రకోట లోకి దూసుకుపోయిన ఆందోళనకారులు ఎర్రకోటపై నిషాన్ సాహెబ్ జెండాను ఎగరవేశారు.ఈ గందరగోళంలో ఒక నిరసనకారుడు మరణించగా, హింసాత్మక ఘటనల మధ్య ఎర్రకోటపై ఎగిరిన నిషాన్ సాహెబ్ జెండా అందరినీ షాక్ కి గురి చేసింది. ఇక ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం 44 కి పైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 127 మందిని అరెస్టు చేసింది. ఖలిస్తాన్ ఉగ్రవాదులు అంటూ ముద్ర వేసి రైతు ఉద్యమాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ రైతులు ఉద్యమాన్ని కొనసాగించారు.

కరోనా మహమ్మారి కారణంగా రైతుల ఉద్యమం పై ప్రజల్లో తగ్గిన ఫోకస్

కరోనా మహమ్మారి కారణంగా రైతుల ఉద్యమం పై ప్రజల్లో తగ్గిన ఫోకస్


ఆ తర్వాత మార్చి ఆరవ తేదీన సరిహద్దుల్లో రైతుల ఆందోళన కు వంద రోజులు పూర్తయ్యింది. ఈ సందర్భంగా అన్నదాతలు వినూత్న రీతిలో తమ నిరసనను తెలియజేశారు. ఆ తర్వాత కరోనా మహమ్మారి విజృంభించడంతో రైతుల పోరాటం కొనసాగుతున్నప్పటికీ దేశం దృష్టి కరోనా మహమ్మారి పై కొనసాగింది. మళ్లీ అక్టోబర్ 3వ తేదీన ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో రైతుల ఆందోళన కారణంగా చోటుచేసుకున్న ఘటన రైతు ఉద్యమాన్ని మరోసారి తెర మీదకు తీసుకు వచ్చింది. లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

లఖింపూర్ ఖేరి ఘటనతో మళ్ళీ తెరమీదకు రైతుల ఉద్యమం

లఖింపూర్ ఖేరి ఘటనతో మళ్ళీ తెరమీదకు రైతుల ఉద్యమం

ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా, యుపి డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య లు బన్బీర్ పూర్ లో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో, మంత్రులు పాల్గొనబోయే కార్యక్రమంలో నిరసన తెలియజేయడానికి పలువురు రైతులు నల్లజెండాలతో వెళ్లారు .టికోనియా బన్బీర్ పూర్ రోడ్డులో కాన్వాయ్ వెంట నినాదాలు చేస్తూ నిరసన తెలియజేస్తున్న రైతులకు మీదికి కాన్వాయ్ లోని ఓ వాహనం దూసుకెళ్లడంతో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు.ఆ తర్వాత చోటు చేసుకున్న ఉద్రిక్తతల మధ్య మొత్తంగా లఖింపూర్ కేరి ఘటనలో 9 మంది మృతి చెందారు. పెద్ద ఎత్తున చెలరేగిన హింసాకాండ రాజకీయ ప్రకంపనలు రేపింది. బీజేపీ సర్కార్ కు పెద్ద తలనొప్పి తెచ్చి పెట్టింది.

సాగు చట్టాలను రద్దు చేసిన ప్రధాని, పార్లమెంట్ లో బిల్లు రద్దు

సాగు చట్టాలను రద్దు చేసిన ప్రధాని, పార్లమెంట్ లో బిల్లు రద్దు


తర్వాత నవంబర్ 19 వ తేదీన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రైతులకు క్షమాపణ చెప్పి నరేంద్ర మోడీ రైతుల ఆందోళనను విరమించాలని విజ్ఞప్తి చేశారు. అయితే రైతులు మాత్రం పార్లమెంటులో 3 వ్యవసాయ చట్టాల బిల్లును రద్దు చేసిన తర్వాత తమ ప్రధానమైన డిమాండ్లను వెంటనే అంగీకరిస్తూ కేంద్ర లిఖితపూర్వక ఒప్పందం చేస్తేనే రైతు ఉద్యమాన్ని విరమిస్తామని స్పష్టం చేశారు. దీంతో శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో నవంబరు 29వ తేదీన మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. డిసెంబర్ ఒకటవ తేదీన 3 వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు పై రాష్ట్రపతి సంతకం చేశారు.

రైతుల డిమాండ్లకు కేంద్రం ఓకే ... చరిత్ర పుటల్లో నిలిచిన రైతుల ఆందోళన

రైతుల డిమాండ్లకు కేంద్రం ఓకే ... చరిత్ర పుటల్లో నిలిచిన రైతుల ఆందోళన

డిసెంబరు 7 వ తేదీన రైతుల అన్ని డిమాండ్లను అంగీకరిస్తూ డ్రాఫ్ట్ రూపంలో రైతు సంఘాలకు కేంద్రం లేఖ పంపింది. డిసెంబర్ 9వ తేదీన 378 రోజుల నుండి సాగించిన రైతుల ఉద్యమానికి ముగింపు పలికింది సంయుక్త కిసాన్ మోర్చా. రైతు సంక్షేమం కోసం తమకు నష్టం చేసే సాగు చట్టాలను రద్దు చేయడమే కాకుండా, మద్దతు ధరపై కూడా స్పష్టమైన హామీతో రైతులు సంతోషంగా ఇళ్ళకు తిరిగి వెళ్ళారు. మొత్తంగా 2021 ఢిల్లీ కేంద్రంగా సాగిన రైతు ఉద్యమంలో అనేక విషాదకరమైన సంఘటనలు చోటు చేసుకున్న, వందలాది మంది రైతులు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు విషాదాన్ని మిగిల్చినా, చివరిగా రైతు పోరాటం విజయాన్ని సాధించి ఎన్నో పోరాటాలకు దిక్సూచిగా మారింది. స్ఫూర్తిదాయకమైన పోరాటంగా చరిత్రపుటల్లో నిలిచిపోయింది.

English summary
In the year 2021, farmers protest on the borders of the national capital, created a history. The struggle of the farmers to repeal the three agricultural laws brought by the Center has finally paid off by the end of 2021.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X