21 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చాం.. మరో 26 లక్షలు ఇస్తాం: కేంద్రం

కరోనా వైరస్ నివారణ వ్యాక్సిన్ ద్వారానే జరుగుతుంది. వ్యాక్సిన్ తీసుకుంటే 6 నెలల వరకు ఇబ్బంది ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే తెలుగురాష్ట్రాలు.. మరి కొన్ని చోట్ల మాత్రం వ్యాక్సిన్ ఇవ్వడం లేదు. స్టాక్ లేదని చెబుతూ.. వ్యాక్సినేషన్ నిలిపివేశారు. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కేంద్రం/ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దీనిపై మాటలయుద్దం కూడా జరుగుతోంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ ఇప్పటివరకు ఎన్ని అందజేశాం.. ఇంకా ఎన్ని ఇవ్వాలనే అంశంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటి వరకు 21 కోట్లకు పైగా కోవిడ్ -19 వ్యాక్సిన్ డోసులను ఉచితంగా అందించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దాదాపు 26 లక్షల వ్యాక్సిన్ డోసులను రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు అందింస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తన్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. రోజురోజుకూ కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి.

21 crore vaccine doses are given to states: central government

ఇప్పుడు భారత్‌లో సెకండ్ వేవ్ నడుస్తోంది. అక్టోబర్‌లో థర్డ్ వేవ్ అంటున్నారు. ఇదీ చిన్న పిల్లలపై ప్రభావం చూపించనుంది. మళ్లీ మార్చిలో ఫోర్త్ వేవ్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అంటే కరోనాతో కలిసి సహజీవనం చేయాల్సిందే. మాస్క్ ధరిస్తూ.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+