మిత్రులతో కలిసి ప్రేమికుడే అమ్మాయిపై రేప్ చేశాడు
ముంబై: మహారాష్ట్రలో ఓ యువతిపై దారుణం జరిగింది. 21 ఏళ్ల అమ్మాయిని ముగ్గురు యువకులు ఎత్తుకెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి భీవండీలో జరిగింది. ముగ్గురు నిందితుల్లో ఒకతను అమ్మాయికి స్నేహితుడు. మరో ఇద్దరు అతనికి స్నేహితులు.
నిందితులను గజని చౌధరి, ఎజాజ్ అహ్మద్, రాంప్రవేశ్ చవాన్‌లుగా గుర్తించారు. వారి వయస్సు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉంటుంది. వారు భీవండిలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు. వారు ముగ్గురు ఆమె నివాసం నుంచి ఎత్తుకుపోయి, ఓ నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆమెపై అత్యాచారం చేశారు.

సంఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మంగళవారంనాడు భీవండి తాలూకాలోని పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు చవాన్‌ను అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
చౌధరిలో ఆ అమ్మాయి ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెను నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆమెపై అతను అత్యాచారం చేశాడు.












Click it and Unblock the Notifications