ప్రియుడితో పరారైన యువతి మృతి: పరువు హత్య?

అయితే యువతి కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని దహనం చేశారని గ్రామస్తులు తమకు తెలిపినట్లు పోలీసులు చెప్పారు. ఘటనపై విచారించిన పోలీసులు యువతి మృతదేహాన్ని చితి నుంచి బయటికి తీశారు. దీంతో ఆగ్రహానికి గురైన యువతి కుటుంబ సభ్యులు కొందరు తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని పోలీసులు తెలిపారు. ఈ ఘర్షణలో ఓ పోలీసు అధికారి సెల్‌ఫోన్‌ను చితిలో పడిపోయిందని వారు తెలిపారు.
యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. యువతి మృతికి సంబంధించిన సాక్ష్యాలను లభించకుండా చేశారని, తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలపై బాధితురాలి తండ్రిపై కేసు నమోదు చేసి కస్టడీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
కాగా తమ ప్రేమను అంగీకరించకపోవడంతోనే ఆ యువతి అదే గ్రామానికి చెందిన ఓ యువకునితో గురువారం నాడు పారిపోయిందని పోలీసులు తెలిపారు. యువతిని లూథియానాలో గుర్తించిన కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకువచ్చారు. అనంతరం యువతి చర్య వల్ల తమ పరువుకు భంగం కలిగిందనే నెపంతో యువతికి బలవంతంగా విషం తాగించి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications