షిండే యూనిఫాం తొలగడం ఖాయం, 22 మంది ఎమ్మెల్యేల వ్యతిరేకత: ఉద్దవ్ వర్గం
మహారాష్ట్రలో షిండే-ఫడ్నవీస్‌తో కూడిన ప్రభుత్వ పాలన కొనసాగుతోంది. మంత్రివర్గం విస్తరణ జరిగి పాలన అంతా సజావుగా జరుగుతుంది. కానీ షిండే వైరి వర్గం మాత్రం మరోలా ప్రచారం చేస్తోంది. అవును షిండేకు పరాభావం తప్పదని ఎడిటోరియల్‌లో రాసింది. త్వరలో షిండేకు చుక్కెదురు ఖాయం అని పేర్కొంది.

22 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తి..
ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో గల శివసేనలో అసంతృప్తి ఉందని రాసుకొచ్చింది. 40 ఎమ్మెల్యేల్లో 22 మంది ధిక్కార స్వరం వినిపించనున్నారట. వారు బీజేపీలో చేరతారని సామ్నా తన కథనంలో రాసింది. తాత్కాలిక ఒప్పందంలో భాగంగా ఏక్‌నాథ్ షిండేను సీఎం పీఠంపై కూర్చోబెట్టారని పేర్కొంది. త్వరలో ఆయన యూనిఫాం వదిలేయాల్సి ఉంటుందని రాసుకొచ్చింది.

యూనిఫాం తొలగడం ఖాయమే
ఏ క్షణంలోనైనా యూనిఫాం తొలగించే అవకాశం ఉందని అందరికి అర్ధమైందని పేర్కొంది. అంధేరి ఈస్ట్ ఉపఎన్నికల్లో షిండే వర్గం తన అభ్యర్థిని నిలబెట్టాల్సి ఉంది. బీజేపీ దానిని అడ్డుకుందని వివరించింది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయంపై వారు చెప్పేదంతా అబద్ధం అని తెలిపింది.

బీజేపీలో చేరిక..?
నిజానికి షిండే వర్గంలో 22 మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపింది. వారిలో అధికులు ఏ క్షణమైనా బీజేపీలో చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. బీజేపీ తన స్వార్థం కోసం షిండేని వాడుకుంటుందని విమర్శించింది. ప్రభుత్వం తరఫున అన్ని నిర్ణయాలు ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తీసుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేసింది. వాటిని షిండే ప్రకటిస్తారని తెలిపింది.

జస్ట్ వెయిట్..
ఉద్దవ్ థాక్రేపై షిండే తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు 40 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. సీఎంగా షిండే బాధ్యతలను చేపట్టారు. అనూహ్యంగా డిప్యూటీ సీఎం పదవీని దేవేంద్ర ఫడ్నవీస్‌కు అప్పగించారు. ఆయన అయిష్టంగానే పదవీ చేపట్టారు. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెబితే.. ససేమిరా అన్నారు. చివరికీ అమిత్ షా రంగంలోకి దిగారు. దాంతో డిప్యూటీగా ఉన్నారు. ఇప్పుడు తిరుగుబాటు తప్పదని శివసేన అంటోంది. చూడాలీ మరీ.. ఏం జరుగుతుందోనని.. శివసేన అంచనా నిజమవుతుందా.. ? లేదా అనే విషయాలు మరికొద్దీ రోజుల్లో తెలియనుంది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications