ఇదేందిరా అయ్యా: యూపీలో 22 మంది పాకిస్తానీ మహిళలు నివాసం: వారికి 95 మంది సంతానం

22 Pakistani: ఉత్తరప్రదేశ్‌లో దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. మొరాదాబాద్‌లో 22 మంది పాకిస్తానీ మహిళలు దీర్ఘకాలిక విసాలపై ఇక్కడ నివసిస్తోన్నారు. వారికి ఏకంగా 95 మంది సంతానం ఉన్నారు. అలా ఆ 22 మంది పాకిస్తానీ మహిళల మొత్తం కుటుంబ సభ్యులు సంఖ్య 500 వరకు ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఆ మహిళలందరికీ కూడా పాకిస్తాన్ పౌరసత్వం ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది. అదే సమయంలో భారత్‌లో జన్మించినందున వాళ్ల పిల్లలకు ఇక్కడి పౌరసత్వం లభించింది. ఆ మహిళల వద్ద దీర్ఘకాలిక విసా, పాకిస్తాన్ పౌరసత్వం ఉన్నట్లు నిర్ధారించే డాక్యుమెంట్లు సైతం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

22 Pakistani women living and given birth to 95 children in India

జమ్మూ కాశ్మీర్‌ పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి అనంతరం భారత్‌లో నివసించే పాకిస్తానీయులందరినీ కూడా స్వదేశానికి వెళ్లిపోవాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో- దేశవ్యాప్తంగా విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా ఇక్కడ నివసిస్తోన్న వాళ్ల కోసం అధికారులు సోదాలు నిర్వహిస్తోన్నారు.

ఈ క్రమంలో మొరాదాబాద్‌లో దీర్ఘకాలిక వీసాలపై నివసిస్తోన్న వారిపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ సందర్భంగా ఈ 22 మంది పాకిస్తానీ మహిళల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వీరికి తోడు, ఇద్దరు పాకిస్తానీ పురుషులు మొరాదాబాద్ జిల్లాలో చాలా సంవత్సరాలుగా నివసిస్తున్నట్లు తేలింది. వీరిలో చాలా మంది మహిళలు భారతీయులను వివాహం చేసుకుని, ఇక్కడికి వచ్చారు.

పోలీసుల దర్యాప్తులో ఈ 22 మంది మహిళలకు మొత్తం 95 మంది పిల్లలు ఉన్నారని తేలింది. వీరిలో చాలా మందికి వివాహాలు కూడా జరిగినట్లు జాగ్రణ్ వెబ్‌సైట్ తెలిపింది. ఈ 22 మంది మహిళల్లో నానమ్మలు, అమమ్మలు సైతం ఉన్నారు. వారి పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లతో కలిపి ఈ కుటుంబాల్లో ఇప్పుడు 500 మందికి పైగా సభ్యులు ఉన్నారు.

ఇప్పటికీ ఆ 22 మహిళలకు పాకిస్తాన్ పౌరసత్వం కొనసాగుతోంది. అంటే వీళ్లంతా ఆ దేశీయులే. లాంగ్ టర్మ్ విసాలను కలిగివుండటం దీనికి నిదర్శనం. అయినప్పటికీ, వారి పిల్లలు పుట్టుకతోనే భారతీయ పౌరులు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికీ భారత పౌరసత్వం లేదు.

ఈ 22 మంది మహిళలకు రేషన్, ఆధార్ కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అన్ని రకాల సంక్షేమ పథకాలను పొందుతున్నారు కూడా. వీరందరూ భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారని పోలీసులు తెలిపారు. వారు ప్రస్తుతం వేల్యుడ్ లాంగ్ టర్మ్ విసాలతో భారత్‌లో నివసిస్తోన్నారు.

దీనిపై మొరాదాబాద్ సిటీ ఎస్పీ కుమార్ రణ్ విజయ్ సింగ్ మాట్లాడారు. జిల్లాలో నివసించే పాకిస్తాన్ మూలాలు ఉన్న కుటుంబాలన్నింటి వివరాలు, సమాచారాన్ని సేకరిస్తున్నామని అన్నారు. వారి విసా దరఖాస్తులు, రేషన్ కార్డుల వినియోగం, కుటుంబ సభ్యులు, పాకిస్తాన్/ ఇతర దేశాలతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే వివరాలను పరిశీలిస్తోన్నామని చెప్పారు.

కాగా- ఈ 22 మహిళల్లో ఇద్దరు.. నాలుగేళ్ల క్రితమే భారత్‌కు వచ్చారు. మరికొందరు దశాబ్దాలుగా జిల్లాలో నివసిస్తోన్నారని కుమార్ రణ్ విజయ్ సింగ్ చెప్పారు. పాకిస్తాన్‌లో ఉన్న బంధుమిత్రులతో వారికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయో ఆరా ఆరా తీస్తోన్నామని వివరించారు. వేల్యుడ్ డాక్యుమెంట్లు ఉండటం వల్ల దేశ బహిష్కరణ సాధ్యపడట్లేదని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+