వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘న ఖానేగా.. న ఖానే దుంగా’: 22మంది అవినీతి అధికారుల తొలగింపు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని శాఖల్లోని అవినీతిని సమూలంగా తొలగించేందుకు నడుం బిగించినట్లు కనిపిస్తోంది. అవినీతికి పాల్పడిన ప్రభుత్వ అధికారులపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 22మంది సీనియర్ అధికారులపై వేటు వేసింది.

అంతేగాక, తక్షణమే వారు ఉద్యోగాలకు స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలని ఆదేశించింది. అవినీతి అధికారులకు ఈ ప్రభుత్వంలో చోటు లేదని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల బోర్డు(సీబీఐసీ) 22 మంది ఉద్యోగులను తొలగించింది.

22 senior tax officials facing corruption charges forced to retire by CBIC

వీరంతా కూడా సూపరింటెండెంట్/ఏవో ర్యాంక్‌కి చెందిన అధికారులు కావడం గమనార్హం. ఫండమెంటల్ రూల్ 56(జె) ప్రకారం అధికారులను తొలగించినట్లు సీబీఐసీ పేర్కొంది.'పన్నుల విభాగంలో కొంత మంది అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు' అని స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించిన నేపథ్యంలో అధికారుల తొలగింపు జరగడం గమనార్హం.

అంతేగాక, మోడీ ప్రసంగాన్ని కూడా సీబీఐసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. వేటుపడిన వారిలో సీజీఎస్టీ నాగపూర్, భోపాల్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, జైపూర్, కోల్‌కతా, మీరట్, ఛండీగఢ్ జోన్లకు చెందిన పలువురు సీనియర్ అధికారులు ఉన్నారు.

ముంబై, బెంగళూరు జోన్లకు చెందిన కస్టమ్స్ అధికారులు కూడా ఉన్నారు. మరికొంత మంది అధికారులు సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. వారిని కూడా సాగనంపే అవకాశం ఉంది. అవినీతి అధికారులను తొలగించడంపై సోషల్ మీడియా నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తినను.. తిననివ్వనని నరేంద్ర మోడీ అన్నట్లుగానే.. చేస్తున్నారంటూ ప్రశంసిస్తున్నారు.

English summary
In a drive to clean up bureaucracy, Central Board of Indirect Taxes & Customs (CBIC) has compulsorily retired 22 senior officers of the rank of Superintendent/AO due to corruption and other charges, news agency ANI reported today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X