ఎర్రకోట వద్ద పార్క్‌లో నన్ను రేప్ చేశాడు: 23 ఏళ్ల యువతి

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. ఎర్ర కోట పార్క్ వద్ద తనను ఓ ట్యాక్సీ డ్రైవర్ అత్యాచారం చేశాడని 23 ఏళ్ల యువతి ఆరోపించింది.

ఆమె ఫిర్యాదు మేరకు డ్రైవర్ చున్ను కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నోయిడాలోని తన సోదరుడి ఇంటికి వెళ్లానని, ఆ తర్వాత ఢిల్లీ రైల్వే స్టేషన్ వచ్చానని చెప్పింది.

సెప్టెంబర్ 11వ తేదీన రాత్రి ఈ సంఘటన జరిగిందని తెలిపింది. ఆ రోజు తాను లుథియానా వెళ్లేందుకు టిక్కెట్ తీసుకున్నానని, తన రైలు మరుసటి రోజు వేకువజామున 4.30 గంటలకు ఉందని చెప్పింది.

23 year old Raped by Taxi Driver at a Park Near Red Fort

దీంతో తాను వెయిటింగ్ హాలుకు వెళ్లానని, అప్పుడు అర్ధరాత్రి 2 అవుతుందని, ఆ సమయంలో నిందితుడు డ్రైవర్ వచ్చి తనతో మాటలు కలిపాడని చెప్పింది.

ట్రెయిన్ క్యాన్సిల్ అయిందని తనతో అబద్దం చెప్పి, తనను బస్ స్టాప్‌లో దించుతానని నమ్మబలికాడని చెప్పింది.

కానీ అతను తనను రెడ్ పోర్ట్ ప్రాంతంలోని గోల్డెన్ జూబ్లీ పార్క్‌కు తీసుకు వెళ్లి, అత్యాచారం చేశాడని చెప్పింది. తర్వాత తనను పాత ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో దించేసి పారిపోయాడని చెప్పింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 23-year-old woman has alleged that a taxi driver raped her at a park near Red Fort on Wednesday. The driver, Chunnu Kumar has been arrested. The woman said that she was visiting her brother’s house in Noida and reached New Delhi Railway Station on September 11 night.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X