వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుమునోత్రి వద్ద బస్సు బోల్తా.. 25 మంది మృతి, మృతులకు రూ.2 లక్షల పరిహారం..

|
Google Oneindia TeluguNews

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన బస్సుల్లో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో 25 మంది మరణించగా.. మిగతా వారు వాగులో పడిపోయారు. యమునోత్రికి భక్తులతో వెళ్తున్న బస్సు ఆదివారం డంటా ప్రాంతంలో గల ఒక వాగులో పడిపోవడంతో ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్నవారంతా మధ్యప్రదేశ్‌కు చెందినవారని తెలుస్తోంది.

సహాయక చర్యలను పోలీసులతోపాటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది చేపట్టారు. ప్రమాదంపై సీఎం పుష్కర్ సింగ్ ధామి విచారణకు ఆదేశించారు. ప్రమాదం దురదృష్టకర ఘటనగా అభివర్ణించారు. వెంటనే జిల్లా అధికారులు సహాయ చర్యలు చేపట్టారని పేర్కొన్నారు.

25 killed as bus with Yamunotri pilgrims falls in Uttarakhand gorge

ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షలు అందజేస్తారు. గాయపడ్డవారికి రూ.50 వేలు అందజేస్తామని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ మేరకు పీఎంవో ట్వీట్ చేసింది. ప్రమాదంపై మాజీ సీఎం హరీశ్ రావత్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

వెంటనే ఎస్‌డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు దిగింది. ప్రమాదంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి ఫోన్ చేసి మాట్లాడానని అమిత్ షా ట్వీట్ చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. క్షతగాత్రులను సమీపంలో గల ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేరుకోనున్నారు.

English summary
25 people have been killed after a bus carrying 28 pilgrims fell into a gorge near Yamunotri National Highway in Uttarakhand’s Damta.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X