‘బిజెపి టెకెట్ కావాలంటే ఫేస్‌బుక్ ఖాతా తప్పని సరి’!
మీరట్: ఉత్తరప్రదేశ్ శాసనసభకు వచ్చేఏడాది జ రిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్న చాలా మంది అభ్యర్థులకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అ మిత్ షా గట్టి షాకిచ్చారు. సోషల్ మీడియాలో పేరున్న నేతలకే టికెట్ ఇస్తామని స్పష్టంచేశారు.
ఫేస్‌బుక్ ఖాతా ఉందా? అందులో 25 వేల మంది అభిమానులున్నారా? అలాగైతేనే మీ అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తామని తేల్చేస్తున్నారు అమిత్ షా. దీంతో పోటీకి ఉబలాటపడుతున్న చాలా మంది అభ్యర్థులు, ఎంపీలు ఆందోళనలో పడ్డారు.
రాష్ట్ర బీజేపీ నేతలెవరూ సోషల్ మీడియాలో పెద్దగా క్రియాశీలంగా లేకపోవడం గమనార్హం. యూపీ బిజెపి అధ్యక్షుడు లక్ష్మీకాంత్ బాజ్‌పాయికి ట్విట్టర్‌లో 10వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. షామ్లీ ఎమ్మెల్యే సురేష్ రానాకు ఫేస్‌బుక్‌లో 12,856మంది ఫాలోవర్లు ఉన్నారు.

కాగా, బిజ్నోర్ ఎంపీ కున్వర్ భర్తేంద్ర సింగ్ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఫ్యాన్ పేజీ లేదు. ఆయన ఖాతాలో 2,986మంది మాత్రమే ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారు. అంతేగాక, ఇయన ట్విట్టర్ ఖాతాలో అంత చురుగ్గా ఉండరు.
అమిత్ షా నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తుండగా, ఇదేం నిర్ణయమంటూ పలువురు పెదవి విరుస్తున్నారు. అయితే, వచ్చే మూడు నెలల్లో అభ్యర్థలందరూ సోషల్ మీడియాల్లో ఖాతా తెరిచి అక్టివ్‌గా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.
కాగా, నాయకులు చేసే మంచి పనులను చూసి ఓటు వేస్తారు గానీ, సోషల్ మీడియాలో ఫాలోవర్లు ఉంటే సరిపోదని మరికొందరు అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా ఖాతాలున్న వారు ఫాలోవర్లను పెంచుకునే పనిలో ఉండగా, ఖాతా తెరవని వారు సోషల్ మీడియాలోకి ప్రవేశిస్తున్నారు.












Click it and Unblock the Notifications