మైసూరులో ఉరేసుకుని ఇన్ఫోసిస్ టెక్కీ ఆత్మహత్య

సంఘటనా స్థలంలో అతను రాసిపెట్టిన సూసైడ్ నోట్ లభించింది. తన ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కారని అతను రాసి పెట్టాడు. ఒంటరిగా విడిచివెళ్తున్నందుకు తల్లిదండ్రులకు అతను ఆ నోట్‌లో క్షమాపణలు చెప్పాడు. తన ఫోన్‌ను వారి వద్ద ఉంచుకోవాలని కోరాడు.
వినాయక చవితి పండుగ కోసం అతను ఇంటికి వ్చచాడని, ఏం జరిగిందో తెలియదని, తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని మోహన కృష్ణ తండ్రి కృష్ణయ్య చెప్పారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఐటి కంపెనీల్లో పనిచేస్తున్న యువతీ యువకులు తరుచుగా ఆత్మహత్యలకు పాల్పడడం కలవరానికి గురి చేస్తోంది. ఇటీవలి కాలంలో ఐటి కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు ఆత్మహత్యలకు పాల్పడడం ఓ సామాజిక సమస్యగా మారినట్లే కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications