26/11 దాడి లష్కరే తొయిబా కుట్రే: డేవిడ్ హెడ్లీ
ముంబై: 26/11 ముంబై దాడుల కుట్రలో లష్కరే -ఎ-తొయిబా పాత్ర ఉన్నట్లు పాకిస్థాన్ అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ వెల్లడించాడు. ముంబై దాడుల కేసులో నిందితుడైన హెడ్లీని ముంబై న్యాయస్థానం సోమవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది.
2006లో తన పేరును దావూద్ గిలానీకి బదులుగా డేవిడ్ హెడ్లీగా మార్చుకున్నట్లు చెప్పాడు. పాక్ నుంచి ఏడుసార్లు, యూఈఏ నుంచి ఒకసారి భారత్ వచ్చినట్లు వెల్లడించాడు. దాడులు జరిగిన తర్వాత 2009లోనూ భారత్‌కు వచ్చినట్లు చెప్పాడు.
ముంబై పేలుళ్లకు కుట్ర పన్నింది పాకిస్థాన్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ అని హెడ్లీ తెలిపాడు. పాకిస్థాన్ నుంచే పేలుళ్లకు కుట్ర జరిగిందని చెప్పాడు. హఫీజ్ ప్రసంగాలకు ప్రభావితమై తాను లష్కరే తొయిబా ఉగ్రవాదిగా మారినట్లు హెడ్లీ తెలిపాడు.

తనను క్షమిస్తే అప్రూవర్‌గా మారతానని గత డిసెంబర్ 10న భారత న్యాయస్థానాన్ని హెడ్లీ కోరాడు. దీనికి ప్రత్యేక న్యాయమూర్తి సనాప్ కొన్ని షరతులపై అంగీకరించారు. ప్రస్తుతం హెడ్లీ అమెరికా న్యాయస్థానంలో 35ఏళ్ల కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు.
కాగా, సౌదీ అరేబియాకు చెందిన హిందీ ట్యూటర్ అబు జిందాల్, మరో పదిమంది ఉగ్రవాదులు ముంబైలో ఈ దాడులకు పాల్పడ్డారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications