అర్ధరాత్రీ ఇంటిముందు మూత్ర విసర్జన చేసినందుకు కొట్టి చంపిన ఇంటి యజమాని...!

తన ఇంటిముందు అర్థరాత్రీ మూత్ర విసర్జన ఓ వ్యక్తిని కోట్టి చంపిన సంఘటన దక్షిణ ఢిల్లీలోని గోవింద్ పూరి ప్రాంతంలో చోటుకుంది. సోమవారం అర్ధరాత్రీ ఓ 26 సంవత్సరాల వ్యక్తి, మరో ఇంటి ముందు మూత్ర విసర్జన చేస్తుండగా.. దాడి చేసి గాయాల పాలు చేశాడు ఆ ఇంటి యజమాని ,దీంతో గాయాల పాలైన వ్యక్తిని ఢిల్లీలోని ఏయిమ్స్ ఆసుపత్రికి తరలించగా అక్కడే ,చికిత్స పొందుతూ మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు.

పోలీసుల కథనం ప్రకారం ఢిల్లీలోని నెహ్రు క్యాంప్‌ స్లమ్‌లో లీలు అనే 26 సంవత్సరాల వ్యక్తి నివసిస్తాడు. సోమవారం అర్థరాత్రీ లీలు అక్కడే ఉన్న మరో ఇంటిముందు ముత్ర విసర్జన చేస్తుండడంతో అది గమనించిన ఇంటి యజమాని మాన్‌సింగ్ వారించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగిందని దీంతో మాన్ సింగ్ కుమారులు, భార్య లీలును సిమెంట్ బిల్లతో చావబాదారని తెలిపారు.ఇక అప్పుడే భయటకు వచ్చిన లీలు సోదరుడు సంజయ్ లీలును కొడుతున్నట్టు గమనించాడు. దీంతో గాయలపాలైన లీలును ఢిల్లీలోని ఏయిమ్స్‌కు తరలించారు.

26-year-old man was bludgeoned to death with a cement slab for urinating at house

కాగా లీలు పరిస్థితి విషమంగా ఉండడంతో ఎయిమ్స్ డాక్టర్లు పోలీసులు సమాచారం అందించారు. లీలు తీవ్ర గాయాలు కావడంతో అసుపత్రిలో మ‌ృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. కాగా అప్పటికే లీలు పలు వ్యాధులతో బాధపడుతున్నాడని అయనపై పలు రకాల దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటి 17 కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+