Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉదయనిధి స్టాలిన్‌పై కఠిన చర్యలు తీసుకోండి: సుప్రీంకోర్టుకు 262 మంది ప్రముఖుల లేఖ

న్యూఢిల్లీ: సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పలువురు మాజీ న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు సహా మొత్తం 262 మంది ప్రముఖులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌కు లేఖ రాశారు. ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు.

దేశంలో అత్యధిక జనాభా ఉన్న వారికి వ్యతిరేకంగా మాట్లాడారని లేఖలో పేర్కొన్నారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన స్టాలిన్.. కనీసం క్షమాపణలు చెప్పేందుకు కూడా ఒప్పుకోలేదని లేఖలో సంతకం చేసిన ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎన్ ధింగ్రా ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశ లౌకిక స్వభావాన్ని కాపాడేలా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాన న్యామూర్తిని 262 మంది ప్రముఖులు కోరారు. అతి తీవ్రమైన అంశాల్లో చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహిస్తే.. అది కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని పేర్కొన్నారు. ఉదయనిధిపై చర్యలు తీసుకోవడంలో తమిళనాడు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు.

ఈ నేపథ్యంలోనే ఈ కేసును సుమోటోగా తీసుకోవాలని సుప్రీంకోర్టును వారంతా కోరారు. న్యాయాన్ని కాపాడేందుకు తమ అభ్యర్థనను స్వీకరిస్తారని ఆశిస్తున్నట్లు లేఖలో తెలిపారు. ఉదయనిధి స్టాలిన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీజేపీతోపాటు హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. హిందూ మతంపై విషం కక్కుతున్నారని ధ్వజమెత్తారు.

ఉదయనిధి స్టాలిన్‌ను నియంత హిట్లర్‌తో పోల్చింది బీజేపీ.. భారత్‌తో సనాతన ధర్మాన్ని పాటించే 80 శాతం జనాభాకు వ్యతిరేకంగా మాట్లాడి.. మారణహోమానికి పిలుపునిచ్చారని మండిపడింది. హిట్లర్ యూదులను ఎలా ఊచకోత కోయాలని పిలుపునిచ్చారో.. అచ్చం అలాగే స్టాలిన్ సనాతన ధర్మంపై వ్యాఖ్యానించారని విమర్శించింది. ఇలాంటి వారికి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతోందని మండిపడింది.

262 Eminent Persons Write To SC Asking Him To Take Cognisance Of Udhayanidhis Remarks On Sanatana Dharma

భద్రత పెంపు: అసలు ఉదయనిధి స్టాలిన్ ఏమన్నారంటే : తమిళనాడు ప్రొగ్రెసివ్ రైటర్స్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ శనివారం 'సనాతన నిర్మూలన' పేరుతో నిర్వహించిన సమావేశంలో ఉదయనిధి పాల్గొని ప్రసంగించారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని, దీనిని కేవలం వ్యతిరేకించడమే కాకుండా.. కరోనా, డెంగ్యూలాంటి వ్యాధుల్లా పూర్తిగా నిర్మూలించాలని అన్నారు. మరోవైపు, అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్‌కు బెదిరింపుల నేపథ్యంలో ఆయన నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+