ఫేస్‌బుక్ బాసట: చెన్నైలో పాలు రూ.100: కష్టాలు (పిక్చర్స్)
చెన్నై: భారీ వర్షాలు, వరదలతో చెన్నై ఉక్కిరి బిక్కిరి అవుతోంది. చెన్నై వాసులకు సామాజిక అనుసంధాన వేదికలు కొంతలో కొంత ఊరటనిస్తున్నాయి. వారికి వరంగా మారాయి. హీరో సిద్ధార్థ్ ట్విట్టర్ ద్వారా ఆహార పొట్లాలు, వాటర్ ప్యాకెట్లూ సేకరించి ఇస్తున్న విషయం తెలిసిందే.
చాలామంది సహాయం కోసం సోషల్ నెట్ వర్కింగ్ సైట్లను ఉపయోగించుకుంటున్నారు. చెన్నైలో ఎవరి ప్రాంతంలోనేనా పరిస్థితి కొంత బాగుంటే... అక్కడకు రావాలని బాధితులకు సోషల్ నెట్ వర్కింగ్ ద్వారా సూచిస్తున్నారు.
ఫేస్‌బుక్ కూడా బాసటగా నిలుస్తోంది. వరదలతో తమ వారిక్షేమ సమాచారం గురించి బంధువులు, స్నేహితులు ఆందోళన చెందకుండా చెన్నైవాసుల స్టేటస్‌ను తెలిపేలా సేఫ్టీ చెక్ ఫీచర్ ప్రవేశ పెట్టింది.
ఈ ఫీచర్ వల చెన్నైవాసుల యూజర్ పేజీలో సేఫ్టీ చెక్ ఆప్షన్ వస్తుంది. దీనిలో సేఫ్‌గా ఉన్నామని చెబుతూ క్లిక్ చేయడం ద్వారా ఆ సమాచారం బంధువులు, స్నేహితులకు తెలిసిపోతుంది. గతంలో పారిస్‌లో దాడుల సమయంలోను ఈ సదుపాయాన్ని ఫేస్‌బుక్ కల్పించింది.

పలు రైళ్లు రద్దు
చెన్నైలో భారీ వర్షాలు, వరదల కారణంగా పలు రైళ్లు రద్దయ్యాయి. చెన్నై - గూడూరు సెక్షన్ వద్ద రైల్వే వంతెనపై ప్రమాదస్థాయిలో వరదనీరు ప్రవహిస్తోంది.

పలు రైళ్లు రద్దు
రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో పలు రైళ్లు రద్దుకాగా, మరికొన్ని రైళ్లను దారిమ మళ్లించినట్లు రైల్వేశాఖ అధికారులు ప్రకటించారు.

పలు రైళ్లు రద్దు
గురువారం నాటి చెన్నై సెంట్రల్ - హౌరా కోరమండల్ ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్ - అహ్మదాబాద్ నవజీవన్ ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్ - తిరుపతి ఎక్స్‌ప్రెస్, విశాఖ - సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్ రద్దు చేశారు.

పలు రైళ్లు రద్దు
గురువారం బయలుదేరాల్సిన తిరుపతి - చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్, రేపటి గౌహతి - చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ రద్దయ్యాయి.

పలు రైళ్లు రద్దు
విజయవాడ - చెన్నై సెంట్రల్ పినాకిని ఎక్స్‌ప్రెస్ గూడూరు వరకు పరిమితం చేశారు. ముంబై - చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ అరక్కోణం వరకు పరిమితం చేశారు.

చెన్నై కకావికలం - జయ ఏరియల్ సర్వే
ముఖ్యమంత్రి జయలలిత చెన్నై, పరిసర ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాలను ఆమె గుర్తించారు. అనంతరం ఈ విషయంపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పన్నీర్‌సెల్వం సహా పలువురు మంత్రులకు సహాయకచర్యలను పర్యవేక్షించే బాధ్యత అప్పగించారు.

చెన్నై కకావికలం
చెన్నై విమానాశ్రయంలో చిక్కుకున్న ప్రయాణీకులను భారత వైమానిక దళం (ఐఏఎఫ్) సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది. చెన్నై నుంచి ఢిల్లీ, హైదరాబాద్ తరలిస్తున్నారు.

చెన్నై కకావికలం
చెన్నై విమానాశ్రయాన్ని డిసెంబర్ 6వ తేదీ వరకు మూసేస్తున్నట్లు అధికారుల చెప్పారు. దీంతో చెన్నై సమీపంలోని అరక్కోణం వద్ద ఉన్న ఐఎన్ఎస్ రాజలిని ఎయిర్ బేస్‌గా వాడుతున్నారు. రాజలి వద్ద రెండు సి17 ఎయిర్ క్రాఫ్ట్‌లు, తాంబరం ఎయిర్ బేస్‌లో సీ 130 జే ఎయిర్ క్రాప్టులు సిద్ధంగా ఉన్నాయి. విమానాశ్రయంలో చిక్కుకున్న వారికి సహాయం చేయనున్నాయి.

చెన్నై కకావికలం
భారీ వరదల కారణంగా చెన్నైలో విద్యుత్, రవాణా, సమాచార వ్యవస్థ దెబ్బతిన్నాయి. దీంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గురువారం వర్షం కాస్త తెరిపి ఇవ్వడంతో నిత్యావసర వస్తువుల కోసం రోడ్ల పైకి వచ్చారు.

చెన్నై కకావికలం
నిత్యావసర వస్తువులను చాలా అధికంగా విక్రయిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కూరగాయలు కిలో వంద, పాలు లీటర్ రూ.వందకు అమ్ముతున్నారు.












Click it and Unblock the Notifications