బస్సు ప్రమాదం-27మంది సజీవదహనంలో ట్విస్ట్: ఒక్కరూ చనిపోలేదు! అసలేం జరిగిందంటే?
Recommended Video

పాట్నా: బీహార్ రాష్ట్రంలో గురువారం మధ్యాహ్నం ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అంతేగాక, ఈ ప్రమాదంలో 27మంది సజీవ దహనమైనట్లు కూడా వార్తలు అన్ని మీడియాల్లోనూ వచ్చాయి. అధికారులు కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు.

ఒక్కరూ చనిపోలేదు..
తాజాగా, ఈ బస్సు ప్రమాద ఘటనలో ఎవరూ ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన మాట నిజమే కానీ, ఈ ప్రమాదంలో ఒక్కరూ కూడా చనిపోలేదని స్వయంగా బీహార్ మంత్రి దినేష్ చంద్ర యాదవ్ వెల్లడించారు.

27మంది చనిపోయారని..
అయితే, ఈ ప్రమాదంలో 27మంది మరణించారని కూడా మొదట ఆ మంత్రివర్యులే మీడియాకు చెప్పడం గమనార్హం. బస్సు పూర్తిగా కాలిపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పారు.

ప్రయాణికులంతా సేఫ్
ఈ ప్రమాదం జరిగిన బస్సులో కేవలం 13మంది ప్రయాణికులు, డ్రైవర్, సహాయకుడు మాత్రమే ఉన్నారని తోటి ప్రయాణికులు చెబుతున్నారు. తామంతా ప్రమాదానికి ముందే బస్సు దిగామని తెలిపారు. మొత్తం 32మంది ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకున్నారని, వీరిలో 13మంది మాత్రమే ముజఫర్‌పూర్‌లో ఎక్కారని తెలిపారు.

పరిహారం కూడా ప్రకటించిన సీఎం..
కాగా, ఈ ఘటనపై గురువారం బీహార్ ఉపముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇది ఇలావుంటే, ఈ ప్రమాదం నేపథ్యంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మృతుల కుటుంబీకులకు రూ.4లక్షల పరిహారం కూడా ప్రకటించడం గమనార్హం.












Click it and Unblock the Notifications