రివాల్వర్ గురి పెట్టి మహిళపై గ్యాంగ్ రేప్
లక్నో: ఇంటిలో ఒంటరిగా ఉన్న మహిళను రివాల్వర్ తో బెదిరించి నలుగురు పదేపదే గ్యాంగ్ రేప్ చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని ఎత్ జిల్లాలోని హర్ సింగ్ గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
హర్ సింగ్ గ్రామంలో 27 సంవత్సరాల మహిళ ఇటివల ఇంటిలో ఒంటరిగా ఉంటోంది. అదే సమయంలో నలుగురు ఇంటిలో చోరబడ్డారు. ఇంటి తలుపులు మూసివేసి ఆమె తల మీద రివాల్వర్ గురి పెట్టి చంపేస్తామని బెదిరించారు.
తరువాత నలుగురు కామాంధులు పదేపదే ఆమె మీద అత్యాచారం చేశారు. అత్యాచారం చేస్తున్న సమయంలో రివాల్వర్ ఆమె తలకు గురిపెట్టడంతో కేకలు వెయ్యలేకపోయింది. తరువాత విషయం బయటకు తెలిస్తే నిన్ను చంపేస్తామని హెచ్చరించి వెళ్లారు.

అయితే ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గ్యాంగ్ రేప్ చేసిన నిందితులు పలుకుబడి ఉన్న వారు. స్థానిక పోలీసులు వారి మీద కేసు నమోదు చెయ్యలేదు. అయితే బాధితురాలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసి కోర్టును ఆశ్రయించారు.
బాధితురాలి మీద గ్యాంగ్ రేప్ జరిగిందని వైద్యులు నివేదిక ఇచ్చారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు బ్రజేష్, దుర్గేష్, భరత్ సింగ్ తో పాటు మరొ వ్యక్తి మీద కేసు నమోదు చేశారు. ఈ నలుగురు పరారైనారని గురువారం కోర్టులో పోలీసులు ఎఫ్ఐఆర్ సమర్పించారు.












Click it and Unblock the Notifications