వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓఖి తుపాను, కేరళలో 270 మంది గల్లంతు, సముద్రంలోకి వెళ్లారు, 33 మంది క్షేమం!

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: ఓఖి తుపాను కారణంగా కేరళలో సముద్రతీర ప్రాంతాల్లో దాదాపు 270 మంది మత్స్యకారులు గల్లంతు అయ్యారు. అయితే కేరళ ప్రభుత్వం మాత్రం 70 మంది గల్లంతు అయ్యారని, 33 మందిని భారత నావికా దళం (ఇండియన్ నేవీ) సిబ్బంది రక్షించారని తెలిపింది.

తమిళనాడులో తుపాను, కన్యాకుమారి అతలాకుతలం, నలుగురు మృతితమిళనాడులో తుపాను, కన్యాకుమారి అతలాకుతలం, నలుగురు మృతి

గురువారం నుంచి తమిళనాడు, కేరళలో ఓఖి తుపాను భీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన రెండు గంటల్లోనే ఓఖి తుపాను తన ప్రతాపం చూపించింది. అప్పటికే సముద్రంలో చేపలు పట్టడానికి మత్స్యకారులు వెళ్లిపోయారు.

270 Kerala fishermen have not returned to the Thiruvananthapuram coast

సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు చాల మంది గల్లంతు అయ్యారు. దాదాపు 270 మంది కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. సముద్రంలో తుపానులో చిక్కుకున్న 33 మందిని భారత నావికా దళం అధికారులు, సిబ్బంది క్షేమంగా రక్షించారు.

తమిళనాడులో భారీ వర్షాలు, 8 మంది మృతి, ఓఖి తుపాను దెబ్బకు హై అలర్ట్, కేరళలో!తమిళనాడులో భారీ వర్షాలు, 8 మంది మృతి, ఓఖి తుపాను దెబ్బకు హై అలర్ట్, కేరళలో!

కేరళ మత్స్యశాఖా మంత్రి జే. మెర్సీకుట్టి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ సముద్రంలో చిక్కుకున్న 33 మందిని భారత నావికా దళం, సముద్రతీర గస్తీ సిబ్బంది క్షేమంగా రక్షించారని, 70 మంది కోసం గాలిస్తున్నారని చెప్పారు. అయితే 270 మందికి పైగా సముద్రంలో గల్లంతు అయ్యారని సమాచారం.

English summary
270 Kerala fishermen have not returned to the Thiruvananthapuram coast which has been hit by Cyclone Ockhi.The Indian Navy and Coast Guard have rescued 33 fishermen and have located another 70 following the bad weather conditions that hit Kerala and Tamil Nadu coasts a day ago.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X