ఐఎస్ఐఎస్‌లో 28 మంది భారతీయులు!
న్యూఢిల్లీ: భారతదేశానికి చెందిన 28 మంది ఇస్లామిక్ స్టేట్(ఐఎస్ఐఎస్)లో చేరారని ఇంటెలిజెన్స్ అధికారులు అంటున్నారు. భారత్ నుంచి వెళ్లిన వారిలో 23 మంది ఇరాక్, సిరియాలో ఉన్నారని అధికారులు అన్నారు.
మిగిలిన ఐదు మంది ఎక్కడ ఉన్నారు అనే విషయం తెలియడం లేదని ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పారు. ఇటీవల గత సెప్టెంబర్, అక్టోబర్ నెలలో నలుగురు ఇస్లామిక్ స్టేట్ లో చేరారని తమకు సమాచారం వచ్చిందని అన్నారు.
అయితే ఈ 28 మంది ఈ మధ్య కాలంలో వెల్లలేదని వివరించారు. ఐఎస్ఐఎస్ లో ముగ్గురు చేరారని ఇప్పటికే మహారాష్ట్రలో కేసులు నమోదు అయ్యాయని, మిగిలిన ఇద్దరి మీద అనుమానాస్పద కేసులు నమోదు అయ్యాయని ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు.

ఇంటెలిజెన్స్ అధికారుల కథనం మేరకు 28 మంది భారతీయులు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ లో చేరారు. అయితే అనధికారికంగా 61 మంది భారత్ నుంచి సిరియా, ఇరాక్ వెళ్లారని తెలిసింది. అయితే ఆ 33 మంది కనపడటం లేదని మిస్సింగ్ కేసులు నమోదు అయ్యాయని అధికారులు అంటున్నారు.
మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్న సిమి ఉగ్రవాదుల్లో ఇద్దరు యువకులను రెచ్చగొట్టి భారత్ నుంచి వెళ్లి ఇస్లామిక్ స్టేట్ లో చేరడానికి సహకరించారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
భారత్ కు చెందిన 40 మంది ఇస్లామిక్ స్టేట్ లో చేరి యుద్దం చెయ్యడానికి ప్రయత్నించారని, వారిని తాము అడ్డుకున్నామని ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. భారత్ నుంచి సిరియా, ఇరాక్ వెళ్లిన వారి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని ఐబీ అధికారులు వివరించారు.












Click it and Unblock the Notifications